మంత్రి తొక్కేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన.!?

0

ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. సీనియర్లు అగ్రకులస్థులను పక్కనపెట్టి మరీ సామాజిక న్యాయం చేయడం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సైతం మంత్రులను చేశారు. ఈక్రమంలోనే మంత్రులు కావాల్సిన రోజా ధర్మాన అంబటి లాంటి సీనియర్లు మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చింది. అయితే సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆయా జిల్లాలోని జూనియర్ ఎమ్మెల్యేల మాట వినడం లేదట..

ఇక కొన్ని చోట్ల కొత్త ఎమ్మెల్యేలు సైతం ఈ మంత్రుల వాలకం చూసి మొత్తుకుంటున్న పరిస్థితి వైసీపీలో వినిపిస్తోంది.తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను ఓ మంత్రి తొక్కేస్తున్నారని తెగ బాధపడుతున్నాడట.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సదురు ఎమ్మెల్యేకు రాజకీయ అనుభవం తక్కువ. దీంతో ఆ మంత్రి ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో మంత్రి తీరుపై సదురు కొత్త ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్టు టాక్.

ఇక ఆ మంత్రికి అధికారులు కూడా తెగ ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఎమ్మెల్యేను అస్సలు పట్టించుకోవడం లేదట.. దీన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక పోతున్నాడని అనుచరులు చెబుతున్నారు.

తనను అసెంబ్లీకి పంపించిన అనుచరులు కార్యకర్తలకు అవసరమైన చిన్న చిన్న పనులు కూడా చేయలేక ఎమ్మెల్యే లోలోపల చాలా బాధపడిపోతున్నారని టాక్. ఇటీవల డైరెక్టుగా ప్రజల ముందే బహిరంగంగా ఆ మంత్రి మీద విరుచుకుపడడంతో విషయం బయటపడింది. మంత్రులను దుష్టశక్తులుగా సంబోంధించి తన అసహనాన్ని సదురు ఎమ్మెల్యే వ్యక్తం చేయడం విశేషం. ఇప్పుడు అధికార పార్టీలో ఈ కొత్త ఎమ్మెల్యే ఆ మంత్రి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ జిల్లాలో చర్చనీయాంశమైంది.