వెంకన్న ‘చౌదరి’, స్వామి వివేకానంద ‘రెడ్డి’.. ఏంటిది రూథర్‌ఫర్డ్?

0

వైఎస్ఆర్సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అసెంబ్లీలో నోరు జారారు. బుధవారం శాసన సభలో విద్యావ్యవస్థ గురించి మాట్లాడిన ఆయన.. స్వామి వివేకానందను కాస్తా.. స్వామి వివేకానంద రెడ్డి చేసేశారు. “If the poor cannot come to education, education must reach them, at the plough, in the factory and everywhere” మన స్వామి వివేకానంద రెడ్డి గారు అన్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే గారు స్వామి వివేకానంద పేరు చివర్లో ‘రెడ్డి’ అని చేర్చడంతో అవాక్కయ్యారు. నోరు జారిన ఎమ్మెల్యేను నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్ కూడా ఇలాగే తప్పుగా మాట్లాడారు. తిరుపతి వెంకన్న స్వామిని వెంకన్న చౌదరి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. టీడీపీ నేతలకు ఉన్న కులపిచ్చికి ఇది నిదర్శనం అని ప్రతిపక్షం టార్గెట్ చేసింది. వెంకన్న స్వామి మా కులదైవం అని అనబోయి.. నోరు జారానని తర్వాత మురళీ మోహన్ వివరణ ఇచ్చుకున్నారు.

అబ్బయ్య చౌదరి విషయానికి వస్తే… గత అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఆయన ఓడించారు. దెందులూరు చింతమనేనికి కంచు కోట. కానీ అబ్బయ్య చౌదరి తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో గెలుపొందారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా.. అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. మే 31 తెల్లవారుజామున రెండు గంటలకు పెదవేగి మండలంలోని రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Please Read Disclaimer