నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల లో ఏపీలో జగన్ తెలంగాణలో హరీష్ రావు టాప్ ..ఎందులో అంటే

0

రాజకీయ నాయకులు అంటే ప్రజలని పరిపాలించేవారు..కానీ ప్రస్తుత రోజుల్లో రాజకీయ నాయకులు అంటే నేరచరిత్ర కలవారే. ఎందుకు అంటే మన దేశంలో చట్ట సభల్లో కొనసాగుతున్న వారిలో సగం మందికి పైగా చిన్న కేసుల నుండి తీవ్రమైన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నవారు కూడా ఉన్నారు. అయితే రాజకీయాల్లో నేరచరిత్రుల పాత్ర అత్యధికంగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకి ఎందుకు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపాల్సి వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియాతో పాటు ఈసీకి వివరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే వీరిపై ఉన్న కేసుల వివరాలను అందరికి కనిపించేలా వెబ్ సైట్ లో పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన రాజకీయ నేతలపై పలు కేసులు విషయం మరోసారి తెరమీదికి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నేతలపై పలు కేసులున్నాయి. ఆ వివరాలని పూర్తిగా ఒక చూద్దాం …… తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీకి చెందిన 51 మంది నేతలపై కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మందిపై కేసులున్నాయి. అలాగే ఏపీ రాష్ట్రంలో వైసీపీకి చెందిన 86 మందిపై టీడీపీకి చెందిన 15 మందిపై కేసులున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు పలువురు రాజకీయ నేతలపై తెలంగాణ ఉద్యమం నాటి కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్యమం లో జరిగిన నమోదైన కేసులను ఎత్తి వేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే సాంకేతిక సమస్యలతో ఇంకా కొన్ని కేసులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ నేతల కేసుల వివరాలని ఒకసారి పరిశీలిస్తే ..మంత్రి హరీష్ రావుపై అత్యధికంగా 41 కేసులు ఉండగా ఆ తరువాత మంత్రి కేటీఆర్ పై 17 కేసులు ఉన్నాయి. అలాగే సీఎం కేసీఆర్ పై 13 కేసులు నమోదైయ్యాయి. అలాగే ఆత్రంసక్కు-13 రోహిత్ రెడ్డి-8 చిరుమూర్తి లింగయ్య-8 ఎర్రబెల్లి-5 కోమటిరెడ్డి-4 గంగుల కమలాకర్-3 దానం-4 సబిత-4 రాజాసింగ్-17 అక్బరుద్దీన్-8 జగ్గారెడ్డిలపై 9 కేసులు ఉన్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ నేతల వివరాలని ఒకసారి పరిశీలిస్తే …. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అత్యధికంగా 38కేసులు ఉన్నాయి. ఉధయ భాను పై 18 కేసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై 15 దాడిశెట్టి రాజా పై 17 కేతిరెడ్డి పెద్దారెడ్డి-8 విజయసాయి-13 జక్కంపూడి రాజా-6 ఆర్కే-7 మాధవ్-2 అవినాశ్ రెడ్డి-4 రఘురాంకృష్ణంరాజుపై 6 కేసులు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు పై 1 కేసు ఉంది. డీపీకి చెందిన కరణం బలరాం-2 బనగాని సత్యప్రసాద్-1 అచ్చెన్నాయుడు-1 వాసుపల్లి గణేష్పై 3 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీలో 101 మంది రాజకీయ నేతల పై కేసులు నమోదై ఉన్నాయి.
Please Read Disclaimer