Templates by BIGtheme NET
Home >> Cinema News >> యూఎస్ లో మళ్లీ విడుదలైన మన రెండు సినిమాలు

యూఎస్ లో మళ్లీ విడుదలైన మన రెండు సినిమాలు


కరోనా కారణంగా ఇండియాలో థియేటర్లు దాదాపు ఆరు నెలలుగా మూతబడే ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం థియేటర్లను బంద్ చేయలేదు. కరోనా కరాళ నృత్యం చేస్తున్నా కూడా థియేటర్ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అక్కడ విడుదల అవ్వడానికి సినిమాలు మాత్రం లేవు. ఎందుకంటే కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో విడుదల కోసం సినిమాలు కనిపించడం లేదు. ఆ కారణంగానే పాత సినిమాలను మళ్లీ స్ర్కీనింగ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

వర్జీనియాలోని రీగల్ సెంటర్ లో రెండు ఇండియన్ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఆ రెండు సినిమాలు ఇక్కడ విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. అయినా కూడా రీగల్ వర్జీనియా సెంటర్ లో నిన్నటి నుండి హిందీ సినిమాలు అయిన ‘సూపర్ 30’ మరియు ‘సింబా’ సినిమాలు స్ర్కీనింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ప్రేక్షకులు కరోనా భయం ఉన్నా కూడా థియేటర్లలో సినిమాలు చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల విడుదల అయిన ‘టెంట్’ సినిమాకు ఏ స్థాయిలో ఆధరణ దక్కుతుందో చూడవచ్చు. నిన్న విడుదలైన మన సినిమాలు సింబా మరియు సూపర్ 30 లకు కూడా మంచి స్పందన వస్తుందని అంటున్నారు.