అండర్ వరల్డ్ డాన్స్ కే భయపడలేదు.. ఈ కోన్ కిస్కా గాళ్ళకి భయపడతానా..?

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”పవర్ స్టార్” అనే వివాదాస్పద టైటిల్ తో తెరకెక్కించిన మూవీ కొన్ని నిమిషాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీగా బుకింగ్స్ చేసుకున్నారు. ‘పవర్ స్టార్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఆర్జీవీ ఈ సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని తీసింది కాదు.. ఇది ఫిక్షనల్ స్టోరీ అంటూనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మూవీ తీశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు.. సినిమా పబ్లిసిటీలో భాగంగా వర్మ పెట్టే ట్వీట్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ విడుదలైన తర్వాత పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు.

అయితే వర్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విడుదల సమయం దగ్గర పడేకొద్దీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ”పవర్ స్టార్” సినిమా విశేషాలు చెప్తూనే తన కార్యాలయంపై జరిగిన దాడి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్.. మీకేమైనా ప్రాణభయం ఉందా..? మీకేమైనా సెక్యూరిటీ కావాలా? అని ప్రశ్నించగా.. దీనికి ఆర్జీవీ మాట్లాడుతూ ”అండర్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు నేను 1997లో కంపెనీ అనే సినిమాలో డైరెక్ట్ అండర్ వరల్డ్ డాన్స్ దావూద్ ఇబ్రహీం.. ఛోటా రాజన్ పేర్లు పెట్టి తీసాను. నేను వాళ్ళకే భయపడలేదు. అలాంటిది నేను ఈ కోన్ కిస్కా గాళ్ళకి భయపడతానా?” అని ఘాటుగా స్పందించారు.