ఒరేయ్ బుజ్జిగా.. ఏమవుతుందో!

0

గతంలో ఒక సినిమాకు మంచి టాక్ వస్తే నెమ్మది గా అయినా పుంజుకునేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఒక సినిమాకు విడుదలకు ముందు హైప్ రావడం చాలా ముఖ్యం గా మారింది. హైప్.. క్రేజ్ ను బట్టే ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి. అవి సరిగా లేకపోతే సినిమాకు కష్టమే.. ఎందుకంటే మొదటి వీకెండ్ ఒక సినిమా ఫలితాన్ని తేల్చేస్తుంది. త్వరలో రానున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ కు కీలకం. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకూ పెద్దగా బజ్ లేదు.

ఒక్క రాజ్ తరుణ్ కు మాత్రమే కాదు ‘ఒరేయ్ బుజ్జిగా’ టీమ్ అందరికీ ఈ సినిమా విజయం అవసరం. హీరో వరస డిజాస్టర్ల తో సతమతమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక నాయర్ నటిస్తోంది. మాళవిక ఈమధ్య నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. తన పరిస్థితి కూడా అంతంతమాత్రమే. దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయింది. హీరో హీరోయిన్లే కాదు. దర్శకుడు కొండా విజయ్ కుమార్.. నిర్మాత రాధా మోహన్ కూడా ఫ్లాపులలోనే ఉన్నారు.

అయితే ఈ సినిమా అవుట్ పుట్ బాగానే ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఇలా కంటెంట్ ఉన్నప్పుడు మంచి ప్రమోషన్స్ తో సినిమా మీద హైప్ క్రియేట్ చెయ్యాలి. ఎందుకంటే సినిమా బాగుందని మౌత్ టాక్ చెప్పేదానికైనా ప్రేక్షకులు మొదటి రోజు థియేటర్లకు రావాలిగా? ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ తో సరైన పబ్లిసిటీ చేస్తేనే అలా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఇక ‘ఒరేయ్ బుజ్జిగా’ రిలీజ్ అవుతున్న మార్చ్ 25 న మరో రెండు సినిమాలు పోటీగా విడుదల అవుతున్నాయి. పోటీ కూడా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ను థియేటర్ల వరకూ రప్పించడం చాలా ముఖ్యం. మరి ‘ఒరేయ్ బుజ్జిగా’ టీమ్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-