ఔను నేను ఇతడితో ప్రేమలో ఉన్నాను

0

సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఇక్కడ ఆశించిన స్థాయిలో స్టార్ డం రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లిన తాప్సి అక్కడ లక్కీగా మంచి సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుని హీరోయిన్గా మంచి పేరు దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచిన తాప్సి ప్రస్తుతం అక్కడ వరుసగా హిట్స్తో దూసుకు పోతుంది. కమర్షియల్ ఆఫర్స్ రాకున్నా కూడా వచ్చిన ఆఫర్లకు పూర్తి న్యాయం చేసి సక్సెస్ లు అందుకున్న తాప్సి తన ప్రియుడిని మీడియా ముందుకు తీసుకు వచ్చింది.

చాలా రోజులుగా తాప్సి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ మాథియాస్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు పలు సందర్బాల్లో బయట కనిపించినా కూడా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. ఎట్టకేలకు వీరిద్దరి మద్య వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. స్వయంగా తాప్సి ఇతడే నా ప్రియుడు అంటూ పేర్కొంటూ పోస్ట్ పెట్టింది. నా తల్లి దండ్రి సోదరికి నా ప్రేమ వ్యవహారం చెప్పి వారు ఒప్పుకున్న తర్వాతే నేను ఈ ప్రకటన చేస్తున్నాను.

నటిగా ఇన్నాళ్లు దక్కించుకున్న ఖ్యాతి నా ప్రేమ వ్యవహారం వల్ల తగ్గిపోకూడదనే ఉద్దేశ్యంతో అమ్మా నాన్నలు ఒప్పుకున్న తర్వాతే నేను నా ప్రియుడికి కూడా చెప్పాను. గత ఏడాదికి ముందే నేను ఈ ప్రకటన చేసి ఉంటే గతేడాది నాకు ఆ విజయాలు వచ్చేవి కావంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మొత్తానికి తాప్సి ప్రియుడిని అధికారికంగా ప్రకటించడంతో ఇన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home