ట్రోలర్స్ దాక్కుని మొరిగే కుక్కలన్న డైరెక్టర్

0

నేను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనుకునే బాపతు కొందరుంటారు. ఆ కోవకే చెందిన కొందరు దర్శకులు తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటారు. ఏదో గొప్ప సినిమా తీశాం అని భావించి కమర్షియల్ గా ఫ్లాపుల్ని ఎదుర్కొంటారు. పైగా విమర్శకుల నుంచి క్రిటిసిజం తప్పదు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు తరుణ్ భాస్కర్.

`పెళ్లి చూపులు` చిత్రంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా వెలిగిపోయాడు. మొదటి సినిమాకే జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ ఏం లాభం.. ఆ తర్వాత ఫ్లాపులు తీసి చేతులు కాల్చుకున్నాడు. నమ్మిన సిద్ధాంతమే గొప్పది అనడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అభిమానుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఎదురుదాడికి దిగడం తనకే చెల్లింది. అక్కడ చీవాట్లు తప్పడం లేదు.

తాజాగా సోషల్ మీడియాలో హీరోల్ని ఉద్ధేశించి అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు వారి అభిమానులు గుర్రుగా ఉన్నారు. “పిచ్చోడిలా అరవడం.. స్మార్ట్ గా డైలాగ్ చెప్పడం.. స్లో మోషన్ ఫైట్లు.. క్లైమాక్స్ లో మెసేజ్ లు ఇచ్చే హీరోలు ఉండరు. చివరి 10 నిమిషాల్లో రైతుల గురించో.. సైనికుల గురించో.. ఇండియా గురించో సందేశాలు ఉండవు. కానీ దీన్ని కూడా ఆ ఊరిలో సినిమా అంటారు మరి“ అంటూ మలయాళ చిత్రం `కప్పెళ`ను తెగ పొగిడేశాడు. పరోక్షంగా మన హీరోల్ని తెరపై చూపించే విధానాన్ని తిట్టాడు. అయితే దీనికి హీరోల ఫ్యాన్ గ్రూపుల్లో ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. ఉచిత సలహాలు అవసరం లేదు! అంటూ దునుమాడారు ఫ్యాన్స్. అయితే ఇలా తనని అనేవాళ్లంతా నకిలీ ఐడీలతో సోషల్ మీడియాలో దాక్కుని తిట్టడమేమిటి? ఆత్మాభిమానం లేదా? అంటూ తరుణ్ భాస్కర్ రెచ్చగొట్టడంతో ఫ్యాన్స్ కౌంటర్లు పెంచేశారు. మొరిగే కుక్కలు అన్న వ్యాఖ్యలు చేయడంతో ఇంకా చెలరేగారు. మొత్తానికి సోషల్ మీడియా ట్రోలింగ్ ట్రెండ్ టూమచ్ గా మారిందనే అర్థమవుతోంది.
Please Read Disclaimer