నూతన గృహం పూజలో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు

0

కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి అయ్యి వారం కూడా గడవక ముందే ఈ జంట తమ కొత్త ఇంట అడుగు పెట్టారు. పెళ్లికి ముందే గౌతమ్ మరియు కాజల్ లు ముంబయిలో ఇద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఇల్లు తీసుకుని దాన్ని ఇంటీరియర్ చేయించారు. నేడు కాజల్ మరియు గౌతమ్ లు నూతన గృహంకు సంబంధించిన పూజలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త దంపతులు అంటేనే మామూలుగా మెరిసి పోతూ ఉంటారు.

సామాన్యులు కూడా కొత్తగా పెళ్లి అయిన సమయంలో ఫేస్ లో గ్లోయింగ్ ఉంటుంది. ఇక కాజల్ గౌతమ్ ల మొహాలు కూడా పెళ్లి కళతో ఇంకా వెలిగి పోతున్నాయి. పెళ్లి అయిన వెంటనే గృహ ప్రవేశం చేసిన జంటగా వీరిద్దరు నిలిచారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటూ నూతన గృహ ప్రవేశం సందర్బంగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా మీ తరపున కూడా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.