పాన్ ఇండియా సినిమాల కోసం అనుష్క ప్రయత్నాలు

0

ఈమద్య కాలంలో సౌత్ హీరోలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అంతా కూడా పాన్ ఇండియా సినిమాల మంత్రం జపిస్తున్నారు. వరుసగా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులతో పాటు అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ మినహా ఎవరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాలను దక్కించుకున్న దాఖలాలు లేవు. కాని మన హీరోల పట్టుదల చూస్తుంటే ఇప్పుడు కాకున్న తర్వాత అయినా అక్కడ ఇక్కడ సూపర్ హిట్ లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అనుష్క కూడా పాన్ ఇండియా స్టార్ డం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

బాహుబలి సినిమాతో ఇప్పటికే ఆల్ ఓవర్ ఇండియాలో ఈమెకు గుర్తింపు దక్కింది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్ ను ఈమె సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇప్పటికి అయినా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఆమె భావిస్తుందట. ఇకపై చేయబోతున్న సినిమా పాన్ ఇండియా మూవీ అయ్యి ఉండాలని ఆమె తన వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలకు చెబుతుందట. ఇటీవల ఆమె నటించి విడుదల అయిన సినిమా నిశబ్దం నిరాశ పర్చింది. ఆ సినిమా విడుదల తర్వాత తన సినిమాల ఎంపిక విధానంను మార్చేసుకున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్బంగా చెప్పిందట. ఇకపై చేయబోతున్న ప్రతి సినిమా కూడా హిందీ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వెళ్లాలని అనుష్క కోరుకుంటుందట. ప్రభాస్ మాదిరిగా ఈమె కూడా పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అవుతుందా అనేది చూడాలి.