బిగ్ బాస్ ఎలిమినేటర్.. స్టార్ హోటల్లో బంధీ

0

బుల్లితెరపై నంబర్ 1 రియాలిటీ షోగా వెలుగొందుతున్న ‘బిగ్ బాస్’కు లీకుల బెడద ఎక్కువైంది. ఒకరోజు ముందే షూటింగ్ జరుపుకునే ఈ షోనుంచి ఎలిమినేషన్ అయ్యేది ఎవరో ఒకరోజు ముందే లీక్ కావడంతో బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో ఉన్న ఉత్కంఠ తగ్గిపోతోంది. మొదటి సీజన్ మహారాష్ట్రలోని ఫుణెలో జరగడంతో లీక్ జరగలేదు. దీంతో ఉత్కంఠ ఊపేసింది. కానీ హైదరాబాద్ లో జరిగిన రెండో సీజన్ ఈ మూడో సీజన్ కు లీకుల బెడద తప్పడం లేదు. స్థానికంగా ఉండడంతో ఎవరో ఒకరు లీక్ చేసేస్తున్నారు.

తాజాగా ఆదివారం ఎలిమినేట్ అయ్యేది నటి హేమ అని శనివారమే అన్ని వెబ్ సైట్లు సోషల్ మీడియాల్లో వచ్చేసింది. దీంతో ప్రేక్షకులకు ముందే తెలిసి ఆ ఉత్కంఠ అనేది లేకుండా పోయింది.

అయితే లీకులు కాకుండా బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోందట.. ఎలాంటి లీకులు కాకుండా ఎలిమినేటర్ ను ఒకరోజు ఎవ్వరికి కనిపించకుండా ముసుగు వేసి స్టార్ హోటల్ కు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారట.. మరుసటి రోజు షో ప్రసారమై ఎలిమినేషన్ పూర్తి అయ్యేదాకా వారిని హోటల్ లోనే ఉంచాలని నిర్ణయించారట.. ఎలిమినేటర్లతో కుటుంబ సభ్యులు ఒకరిద్దరు మాత్రమే మాట్లాడేలా ఒక రోజు దాచిపెట్టే కొత్త స్కెచ్ కు బిగ్ బాస్ టీం ప్లాన్ చేసిందట.. షో నుంచి లీకులు జరగకుండా ఉండాలని బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Please Read Disclaimer