బిగ్ బాస్-3 ఫైనల్ కి మెగాస్టార్?

0

బిగ్ బాస్ సీజన్-3 ఫైనల్ కు చేరుకుంది. విజేత ఎవరు? అన్నది ఈ ఆదివారం తేలిపోనుంది. శ్రీముఖి- బాబా భాస్కర్- అలీరెజా- రాహుల్- వరుణ్ సందేశ్ లు ఫినాలేకు చేరుకున్నారు. గెలపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కంటెస్టెంట్ల కుటుంబ సబ్యులు కూడా అంతే ధీమాగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఫేవరెట్ పై ఎవరికి వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మా ఆయనే విన్నర్ అంటూ వరుణ్ సందేశ్ భార్య వితిక అంటోంది. టాస్క్ ల్లో తనకంటే బాగా వరుణ్ ఆడేవాడని ఆ నమ్మకంతోనే వినర్ ఎవరన్నది ముందే డిక్లేర్ చేసేస్తున్నాని కాస్త అతి చేసింది. ఇక శ్రీముఖి అభిమానులు అదే రేంజ్ లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

బాబా భాస్కర్- అలీ రెజా- రాహుల్ కుటుంబ సభ్యులు మా వాడే విన్నర్ అంటే మావాడే గెలవాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. అటు ఫైనల్ పోరు కావడంతో నిర్వాహకులు సీజన్ 3 ని గ్రాండ్ గా ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఫైనల్స్ కు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దింపాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారుట. మెగాస్టార్ ను ముఖ్య అతిథిగా రప్పించగల్గితే షో బిగ్ హిట్ అయినట్లేనని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారుట. ఈ నేపథ్యంలో నాగార్జున ద్వారానే చిరు ని రంగంలోకి దించే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ -3 కి నాగార్జున హాస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. చిరు-నాగార్జునల స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఆహ్వానించాలే గానీ చిరు రాకుండా ఉండరు. ఇలాంటి ఎంటర్ టైనింగ్ గేమ్ షోలు అంటే చిరంజీవి అంతే ఆసక్తి చూపిస్తారు. ఔత్సాహికులను ప్రోత్సహించడంలో చిరు ముందుంటారు. గతంలో ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer