బిబి4 : స్వాతి దీక్షిత్ హౌస్ లోకి ఎంట్రీ

0

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ఎక్కువ శాతం మంది సాదారణ ప్రేక్షకులకు తెలియని వారే. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో మొదటి రోజే ప్రేక్షకులు పెదవి విరిచారు. వైల్డ్ కార్డ్ తో అయినా స్టార్స్ ను పంపిస్తారనుకుంటే ప్రేక్షకులకు మళ్లీ నిరాశే మిగిలింది. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వెళ్లిన కుమార్ సాయి కి పెద్దగా గుర్తింపు లేదు. ఆయన ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. రెండవ వైల్డ్ కార్డ్ తో జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కాస్త పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సమయం వచ్చింది.

ఈ సీజన్ లో మూడవ వైల్డ్ కార్డ్ గా హాట్ బ్యూటీ  ఇవ్వబోతుంది. ఈమె పేరు సాదారణ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో ఈమె నటించినా కూడా అవి పెద్దగా ఆడలేదు. దాంతో స్వాతి దీక్షిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కనుక ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా మళ్లీ తెలియని మొహమేనా.. ఈమె ఎవరు అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టే అవకాశం ఉంది. అయితే హాట్ బ్యూటీ అవ్వడం వల్ల పులిహోరాకు ఏమైనా పనికొస్తుందేమో చూడాలి.

మొదటి వారంలో సూర్య కిరణ్ రెండవ వారంలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యింది. మూడవ వారంలో కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా టాక్. ఆయన కాకుండా మరెవ్వరు అయినా కూడా ఆ స్థానంలో స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఖాయం అంటూ స్టార్ మా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే స్వాతి దీక్షిత్ క్వారెంటైన్ కు వెళ్లింది. ఆమెను ఆది వారం షో లో నాగార్జున పరిచయం చేయబోతున్నాడు. ఆమె సోమవారం నాటకీయ పరిణామాల మద్య పంపించే అవకాశం ఉందని అంటున్నారు.