మహేష్ మల్టీప్లెక్స్ మొదటి వార్షికోత్సవం.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్

0

మహేష్ బాబు హీరోగానే కాకుండా పలు రంగాల్లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నో కంపెనీలకు ప్రమోషన్ చేస్తున్న మహేష్ బాబు నిర్మాతగా కూడా ఇప్పటికే అడుగు పెట్టిన విషయం తెల్సిందే. ఇక గత ఏడాది ఏఎంబీ సినిమాస్ తో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా మహేష్ బాబు అడుగు పెట్టాడు. సూపర్ స్టార్ బ్రాండ్ తో మొదలైన ఏఎంబీ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు.. రికార్డులను దక్కించుకున్న ఏఎంబీ సినిమాస్ నేడు మొదటి వార్షికోత్సవంను జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఏఎంబీ సినిమా వారు మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ను ప్లాన్ చేసినట్లుగా ప్రకటించారు. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచిన శ్రీమంతుడు సినిమాను నేడు సాయంత్రం 4.05 గంటలకు ప్రదర్శించబోతున్నట్లుగా ప్రకటించారు.

మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ ప్రత్యేక షోకు హాజరు అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో నేడు విడుదల కాబోతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాంక్ పాటను కూడా మల్లీప్లెక్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే టాప్ మల్టీప్లెక్స్ లలో ఏఎంబీ సినిమాస్ నిలిచింది. అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న ఏఎంబీ సినిమా మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
Please Read Disclaimer