మూడు తరాల సూపర్ స్టార్ ఫ్యామిలీ…!

0

నేడు ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు తమ తండ్రుల ఔన్నత్యాన్ని.. వారితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జీవితంలో ప్రతీ ఒక్కరికి తండ్రే హీరో. మంచి చెడులు నేర్పించి సరైన మార్గంలో నడిపించేది కన్న తండ్రి మాత్రమే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తండ్రి కృష్ణతో ఉండే అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎమోషనల్ పోస్ట్ చేసి తన తండ్రి నటశేఖరుడు కృష్ణకి ఫాదర్స్ డే విషెష్ చెప్పారు. మహేష్ తన తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ”నా తండ్రితో ఉన్న అనుబంధాన్ని దయ ప్రేమ స్ట్రాంగ్ సున్నితమైన శ్రద్ధ లాంటి కొన్ని పదాలతో వివరించగలను. నేను వాటితోనే ముందుకు సాగాలని అనుకుంటున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నాన్న. నేను నా పిల్లలకు అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరు ఎల్లప్పుడూ నాకు మార్గదర్శే” అని ట్వీట్ చేసారు. మరోవైపు మహేష్ బాబు పిల్లలు సితార గౌతమ్ లు కూడా తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ అందించారు. సితార ప్రత్యేకంగా మహేష్ కోసం గ్రీటింగ్ కార్డు రెడీ చేసి విషెస్ అందించింది. ‘మాకు మిమ్మల్ని ఇరిటేట్ చేయడం ఇష్టం. మీకు కూడా అదే ఇస్టమని మాకు తెలుసు. మీరు ఎప్పటికి బెస్ట్ ఫాదర్. ఐ లవ్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫాదర్స్ డీ నాన్న” అంటూ పోస్ట్ పెట్టారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించాడు. అంతేకాదు తన నటనతో తండ్రి కృష్ణలా సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నాడు మహేష్ బాబు. చిన్నప్పటి నుంచి మహేష్ కు కృష్ణ తండ్రిగానే కాకుండా గురువులా అన్ని దగ్గరుండి నేర్పించారు. మహేష్ బాబు హీరోగా ఎదగడంలో కృష్ణ ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా ఫాదర్స్ డే ని పురష్కరించుకొని ఘట్టమనేని ఫ్యామిలీకి సంభందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణ తన తండ్రి ఘట్టమనేని రాఘవయ్య చౌదరితో ఉన్న ఫోటో.. మహేష్ బాబు తన తండ్రితో కలిసి దిగిన ఫోటో.. సితార గౌతమ్ లు తమ తండ్రితో ఉన్న పిక్ మూడు కలిపి ఒక ఫోటోగా జత చేసారు. ఇలా ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన మూడు జనెరేషన్స్ ఒక ఫొటోలో దర్శనమివ్వడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Please Read Disclaimer