మెగా డాటర్ మరో రెండు ‘వెబ్ సిరీస్’లు కూడా ఆ ఓటిటి కోసమేనా!!

0

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కాస్ట్యూమ్ డిజైనరుగా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ సుస్మిత త్వరలో వెబ్ సిరీస్ నిర్మాతగా మారనుందని వార్తలొస్తున్నాయి. సుస్మిత తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదివరకే సైరా.. ఇంద్ర వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. తాజాగా వెబ్ సిరీస్ పనుల్ని సుశ్మిత ప్రారంభించింది. తల్లి సురేఖ చేతుల మీదుగా పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసింది. మొదటగా ఓ వెబ్ సిరీస్ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టనుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ల హవా నడుస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘జీ 5’ ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ యదార్థ ఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్స్ పోలీసులకు మధ్య జరిగిన నిజ ఘటనలకు సంబంధించిన కథనాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సుస్మిత మరో రెండు వెబ్ సిరీస్లు ప్లాన్ చేసిందట. రెండు కూడా రొమాంటిక్ జోనర్లో రూపొందుతాయని తెలుస్తుంది. అయితే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తుందని టాక్. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే సుస్మిత మూడు వెబ్ సిరీస్ లను జీ5 ఓటిటికి ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సుస్మితకి ఆహా ఓటిటి ఉండగా.. జీ5 వైపు ఎందుకు వెళ్లిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ త్వరలోనే ఆహాలోకి కూడా అడుగుపెడుతుందని సన్నిహిత వర్గాల సమాచారం.Please Read Disclaimer