రవితేజ హీరోయిన్ కు బంపర్ ఆఫర్..

0ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా సెట్స్ ఫై ఉండగానే, ఈ భామ కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న మూవీ లో హీరో రామ్ కు జోడిగా మాళవిక నుహీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

అడ్వెంచరస్ మూవీ గా రాబోతున్న ఈ మూవీ లో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు మాళవిక శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక నేల టికెట్ విషయానికి వస్తే దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉగాది కానుకగా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.