రాంగ్ టైంలో వచ్చి బుక్ అయిన వారసురాళ్లు

0

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతితో మరోసారి బాలీవుడ్ లో ఉన్న నెపొటిజంపై కొందరు చిన్నపాటి యుద్దమే చేస్తున్నారు. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ మృతి చెందాడు అనేది చాలా మంది ఆరోపణ. ఇక నెపొటిజంకు బ్రాండ్ అంబాసిడర్స్ కరణ్ జోహార్ మరియు మహేష్ భట్ అంటూ చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వారిద్దరి నుండి వచ్చిన సినిమాలు భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాయి. వారి వల్ల ఇద్దరు ముద్దుగుమ్మలు కెరీర్ లోనే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మొదటగా కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన గుంజన్ సక్సేనా సినిమా విడుదల అయ్యింది. జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించిన ఆ సినిమా విమర్శల పాలయ్యింది. గుంజన్ సక్సేనా పాత్రకు ఆమె ఏమాత్రం సెట్ అవ్వలేదని నటన పరంగా కూడా ఆమె బేసిక్గ ఆ నటించలేక పోయిందని రికమండేషన్ క్యాండెట్స్ ను తీసుకుంటే ఇలాగే ఉంటుందని ట్రోల్స్ వచ్చాయి.

గుంజన్ సక్సేనాకు వచ్చిన ట్రోల్స్ ఇంకా మర్చి పోకముందే వచ్చిన సినిమా సడక్ 2. ఆలియా హీరోయిన్ గా నటించడంతో పాటు మహేష్ భట్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కనుక జనాలు ఈ సినిమాను ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. ఈ సినిమాకు ప్రపంచ రికార్డులను కట్టబెట్టారు. సడక్ 2 ట్రైలర్ కు యూట్యూబ్ లో అత్యధికంగా డిస్ లైక్స్ ఇవ్వడంతో ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది.

ఇక ఇటీవల విడుదలైన సినిమాకు రేటింగ్ కూడా అతి తక్కువగా నమోదు అయ్యింది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు అంత తక్కువ రేటింగ్ నమోదు అవ్వలేదు. సుశాంత్ మృతితో నెపోటిజం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న ఈ సమయంలో వీరిద్దరి సినిమాలు విడుదల అవ్వడం అనేది ఏమాత్రం కరెక్ట్ నిర్ణయం కాదు. ఆ విషయం తెలిసేప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.