రెస్టారెంట్ వ్యాపారం.. చేతులు కాల్తాయేమో!

0

తారలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న వైనం చూస్తున్నదే. ఇప్పటికే పలువురు కథానాయికలు కేవలం నటనపైనే ఆధారపడకుండా ఇతరత్రా వ్యాపారాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఆర్జించిన మొత్తాన్ని వ్యాపార అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. రకుల్ ప్రీత్ – తాప్సీ-ఇలియానా- తెలుగమ్మాయి మాధవీలత ఈ కేటగిరీనే. కొందరు టాప్ రేంజ్ యాంకర్లు వ్యాపారాల్లో తలమునకలుగా ఉన్నారు. ఇదే కోవలో జెర్సీ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టింది. తన స్నేహితులతో కలిసి చెన్నైలోని ఒక బిగ్ రేంజ్ మాల్ లో `పెర్సీ` అనే కొత్త సలాడ్ బార్ & కేఫ్ ను శ్రద్ధా ప్రారంభించింది.

తన కొత్త వ్యాపారంపై శ్రద్ధా ఇన్ స్టాగ్రామ్ లో వివరాలు వెల్లడించింది. “రెస్టారెంట్ అని గ్రహించిన ప్రతి ఒక్కరికీ – అవును నిజమేననే చెబుతాను. రెస్టారెంట్ కంటే కొంచెం తక్కువ .. కేఫ్ కన్నా కొంచెం ఎక్కువ.. కచ్చితంగా చాలా మంచి ఆహారం.. సింపుల్ .. ఫ్రెష్ ఫుడ్ ని అందిస్తూ మెరుగైన సేవల వైపు ఆలోచిస్తాను. నేను నా ప్రయాణం లో.. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటుపడ్డాను. అందుకే ఇది నా హృదయానికి చేరువైన వ్యాపారం“ అని తెలిపింది. ఇది మీ-రెగ్యులర్ శాండ్విచ్ లు.. తీపి క్రీమ్స్.. మరికొన్ని అద్భుతమైన తిండి పదార్థాలతో ఆరోగ్యాన్నిచ్చేదిగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తోంది.

చెన్నై లో కొత్త సలాడ్ బార్ & కేఫ్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. అయితే వ్యాపారాలు కొందరికి కలిసి రావు. ఒక్కోసారి తేడా కొట్టినా ఇబ్బందికరమే. ఇకపోతే శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం రవికాంత్ పారెపు `కృష్ణ అండ్ హిజ్ లీలా` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే స్టార్ హీరో విశాల్ సరసన చక్ర అనే చిత్రంలోనూ నాయిక. మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-