రైట్ సినిమాను రాంగ్ వేళలో రిలీజ్ చేసుడేంది త్రివిక్రమ్?

0

చేసేది ఏదైనా సరే టైమింగ్ చాలా ముఖ్యం. కత్తి లాంటి డైలాగైనా సరే.. టైమింగ్ సరిగా లేకుంటే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మాటల మాంత్రికుడు.. తన సినిమాల్లో డైలాగుల తోనే కడుపు నింపేసే దర్శకుడి గా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారికి టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ ను పర్ ఫెక్ట్ గా తయారు చేసే ఆయన.. తన తాజా చిత్రం అల వైకుంఠపురము రిలీజ్ విషయంలో సరైన టైమింగ్ ఎందుకు రిలీజ్ చేయలేదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మాణంలో ఉండగానే భారీ బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ఏమైనా అయితే గురువారం.. లేదంటే శుక్రవారం మాత్రమే విడుదల అవుతాయి. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే బుధవారమే థియేటర్లకు వచ్చి సందడి చేస్తాయి.

ఇలాంటి వాటికి భిన్నంగా సినిమా విడుదలను ఆదివారం పెట్టుకోవటం ద్వారా తొలి వీకెండ్ కలెక్షన్ రికార్డును మిస్ చేసుకుంది అల వైకుంఠపురము టీం. ఆదివారం సినిమా విడుదలైన వేళ.. తొలి వీకెండ్ కలెక్షన్ కేవలం ఒక రోజుకు మాత్రమే లెక్కలోకి వస్తుందన్నది మర్చిపోకూడదు. ఈ విషయం పెద్దది కాకున్నా.. సంక్రాంతి వేళ ఈ సినిమాను విడుదల చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. పక్కాగా అన్ని కుదిరిన సినిమాను పండుగ వేళలో నాలుగు సినిమాల మధ్య బరిలోకి దింపే కన్నా.. విడి రోజుల్లో కానీ రిలీజ్ చేస్తే.. బాక్సాఫీసు లెక్కలు మారటమే కాదు.. కొత్త లెక్కలకు అవకాశాన్ని మిస్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొన్ని సినిమాల్ని ఫలానా టైంలోనే విడుదల చేయాల్సిన అవసరమంటూ ఏమీ ఉండదు. అలాంటి విషయాన్ని త్రివిక్రమ్ మాత్రమే కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింత్ సైతం ఎందుకు మిస్ అయ్యారన్నది క్వశ్చన్. టైమింగ్ విషయంలో పక్కాగా ఉండే త్రివిక్రమ్ వారు అల వైకుంఠపురము విడుదల విషయంలో మాత్రం లెక్క తప్పారన్న అభిప్రాయం సినిమా చూసినోళ్లలో చాలామందిలో కలగటం గమనార్హం. రైట్ సినిమా.. రాంగ్ టైమ్ అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి సినిమా ఇంత పోటీలో కాకుండా సింగిల్ గా వచ్చి ఉంటే మాత్రం.. లెక్కలు మరోలా ఉండేవన్న మాటలో నిజం ఎంతన్నది పది రోజులు ఆగితే మరింత క్లారిటీగా తెలిసిపోవటం ఖాయం.
Please Read Disclaimer