సాయిపల్లవి సక్సెస్ సీక్రెట్ అదేనా!

0

టాలీవుడ్ లో సాయిపల్లవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పిట్టి చిన్నదే అయినా కూత ఘనం అన్న మాదిరి వెలిగిపోతుంది. అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా? నటిగా మాత్రం నీరాజనాలు అందుకుంటుంది. టాలీవుడ్ ఆ రకమైరన క్రేజ్ ని దక్కించుకున్న ఏకైక బ్యూటీ పల్లవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇలా రాణించడం వెనుక వ్యక్తిగతంగా తాను తీసుకుంటోన్న జాగ్రత్తలు సొగసిరిని ఆ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. తనలో యాక్టింగ్స్ స్కిల్స్ తో పాటు..డాన్సింగ్ ట్యాలెంట్ అడిషనల్ క్వాలిఫికేషన్ గా కనిపిస్తుంది. శరీరాన్ని విల్లులా వంచే కష్టపడే తత్వం ఎన్నో సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి.

ఇదంతా పాత విషయమే అయినా? పల్లవి ఇంతగా సక్సెస్ అవ్వడం వెనుకు ఓ సీక్రెట్ ఉందని తాజాగా అమ్మడి మాటల్ని బట్టి తెలుస్తోంది. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నానా? లేదా? అన్నదే తృప్తినిస్తుంది తప్ప సినిమాకి సంబంధించి ఇతర విషయాలేవి పట్టించుకోందుట. ముఖ్యంగా కథ అంతా హీరోయిన్ చుట్టూనే తిరగాలి అన్న విధానానికి పూర్తి వ్యతిరేకినని అంటోంది.

ఓ పాత్ర ఎలా చేయాలన్న విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకోనని.. పాత్ర కోసం ముందుగానే సిద్దం కావాలనే విషయాలు పట్టించుకోనని రివీల్ చేసింది. సెట్ లోని వాతావరణం..తొటి సహచర నటుల అభినయమే తన పాత్ర ఎలా నడుచుకోవాలన్నది ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఏ కథని చదివినా దాన్ని ఓ సినిమాలా విజువలైజ్ చేసుకుంటుందిట.

స్ర్కిప్ట్ విషయంలోనూ అలాగే పీలవుతుందిట. అందువల్ల తాను పోషించే పాత్ర ఎలా ఉంటుందన్నది ముందుగానే తనకి ఓ అవగాహన వచ్చేస్తుందిట. తనలో ఈ అబ్జర్వేషన్ రాత్రికి రాత్రే వచ్చింది కాదని..ఎన్నో సినిమాలు తర్వాత వచ్చిన అనుభవం అని తెలిపింది. కొన్నిసార్లు అంచనాలు తప్పిన సందర్భాలున్నాయని..అయితే వాటిని పెద్దగా పట్టించుకోనని.. కానీ తప్పు ఎక్కడ జరిగిందన్నది మాత్రం కనిపెట్టే ప్రయత్నం చేస్తుందిట.

మొత్తానికి సాయి పల్లవి సక్సెస్ గా ఈ విషయాలన్నింటిని గుర్తించవచ్చు. ఇలా ఎనాలసిస్ చేయడం అన్నది అంత వీజి కాదు. వృత్తి పట్ల ఎంతో ఫ్యాషన్..డెడికేషన్..కమిట్ మెంట్ ఉంటే తప్ప సాధ్యంకాని పని. అవన్ని పల్లవిలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే వెండి తెరను ఏల్తోంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ తో డాన్సులో పోటీ పడతాను తప్ప! యాక్టింగ్ లో కాదంటూ వచ్చిన అవకాశాన్ని సైతం వదులకుంది అంటే ! ఎంతటి ఘనాపాటే అర్ధమవుతోందిగా. అదే సాయిపల్లవి ప్రత్యేకత.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.