2019లో 1000కోట్ల కలెక్షన్ కింగ్!

0

బాలీవుడ్ లో ఖాన్ ల త్రయాన్ని కొట్టే మొనగాడు పుట్టలేదని మాట్లాడుకుంటారంతా. సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్- షారూక్ ఖాన్.. ఎవరికి వారే మొనగాళ్లు. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు తేగలిగే సత్తా ఉన్న హీరోలు. అయితే ఇటీవలి కాలంలో ఖాన్ ల కోటలకు బీటలు వారుతున్నాయి. పోటీ హీరోలు దూసుకొస్తున్నారు. రికార్డులతో బాక్సుల్ని బద్ధలు కొట్టేస్తున్నారు. ఇక ఖాన్ లకు సమకాలికుడైన కిలాడీ అక్షయ్ కుమార్ అయితే రెండేళ్లుగా ఎదురేలేని రికార్డులతో సంచలనం సృష్టిస్తున్నాడు.

2019లో ఏకంగా అతడు 1000 కోట్ల మేర బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టే ఏకైక హీరోగా అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు. మరో 225 కోట్లు ఈ ఏడాదిలో తెస్తే చాలు.. అతడు ఈ ఫీట్ సాధించినట్టే. ఈ ఏడాదిలో అక్షయ్ నటించిన మూడు సినిమాలు రిలీజైతే అన్నీ బంపర్ హిట్లే. కేసరి-మిషన్ మంగళ్-హౌస్ ఫుల్ 4 చిత్రాలు ఈ ఏడాది రిలీజయ్యాయి. కేసరి- 203కోట్లు.. మిషన్ మంగళ్-277 కోట్లు.. హస్ ఫుల్ 4- 290 కోట్లు వసూలు చేశాయి. ఇవన్నీ కలిపితే సుమారు 775 కోట్లు. ఇంకో 225కోట్లు వసూలు చేస్తే చాలు అతడు 1000 కోట్లు వసూళ్లు తెచ్చిన హీరో అవుతాడు. ఇక బ్యాలన్స్ మొత్తం త్వరలో రిలీజ్ కి వస్తున్న `గుడ్ న్యూజ్` తెచ్చేస్తుంది. ఈ చిత్రం ఆ స్థాయిలో కలెక్ట్ చేస్తుందని అప్పుడే ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే సక్సెసైతే ఇక కిలాడీ ఆల్మోస్ట్ ఖాన్ లను అధిగమించినట్టే.

2016లో సల్మాన్ ఖాన్ 970కోట్లు వసూళ్లు తెచ్చాడు. అతడు నటించిన భజరంగి భాయిజాన్ – ప్రేమ్ రతన్ ధన్ పాయో బంపర్ కలెక్షన్స్ తో ఈ ఫీట్ ని సాధించాయి. దేశీయంగా ఏడాదిలో నంబర్ వన్ కలెక్షన్ల హీరోగా నిలిచాడు సల్మాన్. ఇప్పుడు ఆ రికార్డును అక్షయ్ బ్రేక్ చేస్తున్నాడన్నమాట. ఇక అమీర్ ఖాన్ నాన్ లోకల్ (చైనా-జపాన్) వసూళ్లు కలిపితే ఖాన్ లు కిలాడీలు అందరికంటే టాప్ లో ఉన్నాడు.
Please Read Disclaimer