రోజుకు 12 మందు బిళ్లలు.. వామ్మోవ్!

0

ప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నానని బహిరంగంగా చెప్పడం సాహసమే. సమస్యను బయటికి చెప్పడంలో అందరూ అంత ఓపెన్ గా ఉంటారా? అనుకుంటే సన్నజాజి సోయగం ఇలియానా ఇలాంటి విషయాల్ని ఎంతో ఓపెన్ గా అంగీకరించి షాకిచ్చింది. ఒకానొక సమయంలో తీవ్ర ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఇలియానా బహిరంగంగానే ప్రకటించి షాకిచ్చింది.

ఆ తర్వాత కూడా ఈ అమ్మడు తన జీవితంలోని కొన్ని అరుదైన రహస్యాల్ని బయట పెట్టింది. అసలు ఈ భామ నిరంతరం ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఉండాలనుకోవడానికి షాకిచ్చే కారణమే ఉందని చెప్పింది. తనకు అల్జీమర్స్ (నిద్రపట్టని) అనే ఓ అరుదైన రుగ్మత ఉంది. దాని నుంచి ఎస్కేప్ అయ్యేందుకే జిమ్ చేస్తానని కూడా చెప్పి ఆశ్చర్యపరిచింది. అయితే ఇవన్నీ ఒత్తిళ్ల జీవితంలో సహజమే అని అనుకుంటే.. ఇటీవలే బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ కి గుడ్ బాయ్ చెప్పేసి మరోసారి ఒంటరితనానికి గురైంది.

అతడిని వదులుకోవడానికి కారణమేమిటి? అన్నది ఈ అమ్మడు చెప్పకపోయినా.. మట్టి అంటుకుంటుందని తెలిసీ అంటించుకుంటామా? అంటూ పరోక్షంగా మాజీని ఛీత్కరించుకుంది. తమ మధ్య సాగినది సీరియస్ రిలేషన్ షిప్ కాదని.. కాఫీ షాప్ .. రెస్టారెంట్ కి వెళ్లే స్నేహం మాత్రమేనని ఎవరూ ఊహించని ఆన్సర్స్ ఇచ్చి పదే పదే షాకులిచ్చింది. ఏదైతేనేం ప్రస్తుతం ఇలియానా ఒంటరి అయ్యింది. తన లైఫ్ లో ప్రతిదానిని నిజాయితీగా అంగీకరిస్తూ అభిమానులకు షాక్ ల మీద షాక్ లిస్తున్న ఈ భామ తాజాగా మరో ఆసక్తికర సంగతిని రివీల్ చేసింది. ఏడాది కాలంగా నిత్యం మెడిసిన్ వాడనిదే కాలం గడవని పరిస్థితి. రోజూ 12 మందు బిళ్లలు మింగుతున్నానని చెప్పి షాకిచ్చింది. అయితే ఇలాంటి నిజాల్ని చెప్పేందుకు తను ఎందుకో ఏమాత్రం భయపడదు. ప్రతిదీ ఓపెన్ చేసేసే గట్స్ తనకి ఉన్నాయని నిరూపించింది. ప్రస్తుతం ఈ భామ నటించిన భారీ మల్టీస్టారర్ `పాగల్ పంతి` రిలీజ్ కి వస్తోంది. బిగ్ బుల్ అనే వేరొక భారీ చిత్రంలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer