ఈ సారి రూ.144 కోట్లతో వార్తల్లో పీసీ నిక్

0

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరియు నిక్ ల గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరో సారి వీరిద్దరి గురించిన ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది. ప్రియాంక చోప్రా మరియు నిక్ లు ప్రస్తుతం నివాసం ఉంటున్న లాస్ ఎంజెలెస్ లోని ఇంటిని అమ్మేశారట. అదే ప్రాంతం లో ఖరీదైన ఏరియా లో 20 వేల చదరపు అడుగుల పరిమాణం లో ఉన్న ఇంటిని ఈ జంట కొనుగోలు చేసిందట.

అత్యాధునిక హంగుల తో నిర్మించబడ్డ ఈ ఇంటి ని ఏకంగా 20 మిలియన్ డాలర్ల ను అంటే దాదాపుగా 144 కోట్ల రూపాయలను వ్యచ్చించి కొనుగోలు చేయడం జరిగిందట. ఆ ఏరియాల్లో ఇదే అతి పెద్ద కొనుగోలు ఒప్పందం అంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక ఫిల్మ్ స్టార్ మరియు రాక్ స్టార్ కలిసి ఇంత భారీ మొత్తం లో పెట్టి ఇల్లు తీసుకోవడంపై అక్కడి వారు ఆశ్చర్య పోతున్నారట.

ఇక ఇల్లు విషయానికి వస్తే ఇంట్లో మొత్తం 7 విశాలమైన బెడ్ రూంలు ఉన్నాయట. 11 బాత్ రూంలతో పాటు సువిశాలమైన లీవింగ్ రూం… హాల్.. బాల్కనీ మరియు ల్యాన్ లు ఉన్నాయట. జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ లతో పాటు ఇంకా ఎన్నో రకాల ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఆ ఇంట్లో పీసీ అండ్ నిక్ లు ఏర్పాటు చేయించుకుంటున్నారట. నిక్ 144 కోట్ల తో ఇల్లు కొనుగోలు చేయగా నిక్ సోదరుడు జో జోనస్ కూడా 101 కోట్ల రూపాయలు పెట్టి నిక్ ఇంటికి కాస్త దూరం లో ఒక విలాస వంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు గా సమాచారం అందుతోంది.

ఇల్లు కొనుగోలు చేసిన విషయ మై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. కొత్త ఇల్లు మరియు నాకంటూ పిల్లలు అనేది నా కోరిక. ఇల్లు అనేది ఉంది.. ఇక నా పిల్లలు అంటూ ఉండాలని ఆశిస్తున్నాను. రాబోయే పదేళ్ల లో పిల్లలను కంటానంటూ చెప్పుకొచ్చింది. రాబోయే పదేళ్లు అంటే పీసీ ఇంకా చాలా కాలం వెయిట్ చేయాలనుకుంటున్నట్లు గా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer