ఫైటర్ కి 15 మంది మార్షల్ నిపుణుల శిక్షణ

0

కిక్ బాక్సింగ్ .. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలొచ్చాయి కానీ.. వాటన్నిటి కంటే భిన్నంగా ఓ సినిమా తీయాలన్నది డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కోరిక అని తెలుస్తోంది. ఈసారి ఎంచుకునే కాన్సెప్ట్ యూనివర్శల్ యాక్సెప్టెన్సీ తో ఉండాలి. రొటీన్ గా లోకల్ గా చూసేది గా ఉండకూడదని భావించి పూరి అదిరిపోయే స్క్రిప్టు ను రెడీ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి- ఛార్మి బృందం పాన్ ఇండియా కేటగిరీ లో భారీ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై లో చిత్రీకరణ ప్రారంభించే ఏర్పాట్లు చేశారని వార్తలొచ్చాయి. తెలుగు-తమిళం సహా హిందీ లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆ మేరకు షెడ్యూల్స్ ని పూరి ఎంతో తెలివిగా ప్లాన్ చేస్తున్నారు.

హిందీ బెల్ట్ లో డిస్ట్రిబ్యూటర్ కం దర్శకనిర్మాత కరణ్ జోహార్ పూరి టీమ్ కి సాయం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఫైటర్ జాతీయ స్థాయి ప్రాజెక్టుగా రూపాంతరం చెందింది. ఇది రౌడీ-పూరి టీమ్ పైనా మరింత బరువు బాధ్యత పెంచిందనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్.. నేర్చుకునేందుకు థాయ్ ల్యాండ్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ అతడికి ఏకంగా 15 మంది థాయ్ స్పెషలిస్టులు మిక్స్ డ్ మార్షల్ విద్యల్లో కఠోరమైన శిక్షణను ఇవ్వనున్నారట.

కిక్ బాక్సింగ్.. కరాటే..కుంగ్ ఫూ.. థైక్వాండో.. కర్ర ఫైట్ వీటన్నిటినీ మిక్స్ చేసే శిక్షణ ఇది. ఈ విద్యల్లో అన్ని రకాలుగా రాటు దేలాక విజయ్ తిరిగి వస్తాడని తెలుస్తోంది. ఇందు కోసం అతడు స్ట్రిక్ట్ గా డైట్ సహా ఫిగర్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు. బాడీ ఫాస్ట్ మూవ్ మెంట్ కి కావాల్సిన విధంగా రూపాన్ని మార్చుకుంటున్నాడని తెలుస్తోంది. 2021 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఈలోగానే ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రాన్ని పూరి-ఛార్మి బృందం రిలీజ్ చేస్తారు. ఇక ఫైటర్ కోసం దేవరకొండ కావాల్సినంత టైమ్ తీసుకుని పూర్తిగా తన రూపాన్ని ఎవరూ ఊహించనంతగా మార్పు చేయబోతున్నాడని తెలుస్తోంది.
Please Read Disclaimer