సూపర్ స్టార్ నోట మహత్ముని బోధనలు

0

మహత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బాలీవుడ్ స్టార్స్ తో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహత్ముడి గొప్పతనంను తెలియజేసేలా సినిమాలు చేయాలంటూ ఈ సందర్బంగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు మరియు స్టార్స్ కు మోడీ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో నరేంద్ర మోడీ బాలీవుడు స్టార్స్ చేసిన 100 సెకన్ల ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఆ వీడియోను ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ రూపొందించారు. ఆ వీడియోలో అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. ఆలియా భట్.. కంగనా రనౌత్.. విక్కీ కౌశల్.. సోనమ్ కపూర్.. రణ్ బీర్ కపూర్ లు గాంధీజీ బోధనలు చెప్పారు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో సాగిన ఆ వీడియోను మహత్ముని వాయిస్ తో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఒక్కో స్టార్ గాంధీజీ బోధనలు వినిపించారు. ఈ వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

బాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి చేసిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మరిన్ని కార్యక్రమాలు.. సినిమాలు మహత్ముడి గురించి రావాలని కోరుకుంటున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక ఈ వీడియో గురించి బాలీవుడ్ స్టార్స్ పలువురు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. రాజ్ కుమార్ హిరానీ చాలా సింపుల్ గా చక్కగా వీడియోను చేశారంటూ అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
Please Read Disclaimer