6 అడుగుల రానా 16 అడుగులు అయ్యాడు

0

యంగ్ హీరో రానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. సరదా విషయాలు.. ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండే రానా కొద్ది సేపటి క్రితం ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. సాదారణంగానే టాలీవుడ్ హీరోల్లోకి ఎత్తుగా ఉండే రానా ఈ ఫొటోలో మరింత ఎత్తుగా ఉన్నాడు. ఆరు అడుగుల రానా ఏకంగా 16 అడుగులు ఎత్తు అయ్యాడు. జాతరల్లో లేదంటే ఏదైనా ఎగ్జిబీషన్స్ లో సర్కస్ చేసే వారు ఇలా ఎత్తు కర్రల కాళ్లతో ఎత్తుగా కనిపిస్తూ ఉంటారు.

రానా ఎందుకు ఈ ఎత్తు ఆకారంలోకి మారాడో తెలియాల్సి ఉంది. జెస్ట్ ఏ టాల్ హ్యాపీ మీ అంటూ ట్యాగ్ చేసి ఈ ఫొటోను రానా షేర్ చేయడంతో ఏ సందర్బంగా ఈ ఫొటో తీసి ఉంటారా అంటూ ఆలోచనల్లో పడ్డాడు. ఏదైనా సినిమా కోసం రానా ఈ గెటప్ వేసి ఉంటాడా అనుకుంటున్నారు. ఇక చాలా ప్రాక్టీస్ ఉంటేనే అంత ఎత్తు కర్రలపై బ్యాలన్స్ గా నిలబడటం సాధ్యం. అలాంటిది రానా నిలబడటం.. అది కూడా నవ్వుతో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ నిలబడటం ఆశ్చర్యంగా ఉంది.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే అనారోగ్య కారణాల వల్ల రానా కొన్నాళ్లుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇటీవలే షూటింగ్స్ కు హాజరు అవుతున్నాడు. విరాటపర్వం చిత్రంతో రానా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా విరాటపర్వం సినిమా తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం.
Please Read Disclaimer