1980 స్టార్స్ మీట్.. హోస్ట్ ఎవరో తెలిస్తే షాకే

0

80లలో తారలు ప్రతియేటా ఓ చోట రీయూనియన్ పార్టీ పేరుతో కలుస్తున్న సంగతి తెలిసిందే. 1980-1990లో అగ్ర తారలుగా వెలిగి ఇప్పటికీ ఆ వెలుగును ప్రసరిస్తున్న తారాతోరణం ఓచోట చేరి పార్టీతో సందడి చేస్తున్నరు. గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలోకి వస్తూనే ఉన్నాయి. అభిమానులకు అది కన్నులపండుగనే తలపిస్తోంది.

`క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ఓ డ్రెస్ కోడ్ ని ఆపాదించి ఆ పార్టీకి 1980లో నటించిన స్టార్స్ అంతా అటెండవుతున్నారు. ఈసారి స్టార్ల మీట్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఏడాదితో `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పదేళ్లు పూర్తవుతోంది. అంటే దశాబ్ధం పాటు పార్టీలు నిర్విరామంగా జరిగాయి. ఈసారి పదో యానివర్శరీ పార్టీ హైదరాబాద్ లోని చిరంజీవి స్వగృహంలో జరగనుందని తెలుస్తోంది. నవంబర్ లో ఈ పార్టీ జరగనుంది. పార్టీకి గ్యాంగ్ లీడర్ చిరంజీవి హోస్టింగ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్నట్టు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ హౌస్ ని రీమోడలింగ్ చేయడంతో సరికొత్త సొబగులతో ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. సంథింగ్ స్పెషల్ గా తయారైన ఈ ఇంట్లో వేడుకను నిర్వహించాలని చిరు టీమ్ సభ్యుల్ని కోరారట.

ప్రతిసారీ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి- మోహన్లాల్- బాలకృష్ణ- వెంకటేశ్- మోహన్ బాబు వంటి స్టార్లు ఈ సందడి చేస్తున్నారు. సుహాసిని- ఖుష్బూ -రాధిక- సుమలత ఈ పార్టీకి పీఆర్ యాక్టివిటీని చేస్తున్నారు. వీకే నరేశ్- అర్జున్- జాకీ ష్రాఫ్- రమ్యకృష్ణ- ప్రభు- శోభన- భాగ్యరాజ్- శరత్కుమార్-సత్యరాజ్- జయరామ్- నదియా-సుమన్ వంటి తారలు పూర్తి సపోర్టివ్ గా ఉన్నారు. హైదరాబాద్ – చెన్నయ్ వంటి చోట్ల వెన్యూని ఎంపిక చేసి ఇలా తారలు కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి చిరు ఇంట పార్టీకి ఎవరెవరు అటెండవుతారు? అన్నది ఆసక్తికరం.
Please Read Disclaimer