సొంత ఇంటికి 20 కోట్లు పెట్టాడా?

0

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సొంతింటి ఓనర్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్ లోని పోష్ ఏరియాలో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఇంటికి సమీపంలో ఈ కొత్త ఇల్లు కొనుక్కున్నాడట. మొన్న ఆదివారమే కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేశారని వెల్లడైంది. అయితే విజయ్ ఈ ఇంటి కోసం ఎంత పెట్టుబడి పెట్టారు? అంటే.. తాజా సమాచారం షాకిస్తోంది.

రౌడీ హీరో ఈ ఇంటి కోసం ఏకంగా రూ.20కోట్లు చెల్లించాడని తెలుస్తోంది. విజయ్ ఒక్కో సినిమాకి రూ.10కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం ఉంది. ఇటీవల రెండు బ్లాక్ బస్టర్లు ఖాతాలో పడిన తర్వాత అతడి రేంజ్ స్కైని తాకుతోంది. రౌడీ బ్రాండ్ దుస్తుల వ్యాపారం కలిసొస్తోంది. మరోవైపు ప్రయివేటు వాణిజ్య ప్రకటనలకు కోట్లలో ఆదాయం దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టాడని చెబుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైటర్ లో నటించనున్నాడు. ఈ సినిమాతో మరో లెవల్ ని టచ్ చేయాలన్న కసితో ఉన్నాడు.

అయితే కెరీర్ స్పీడ్ గా ఉన్నప్పుడే.. విజయ్ ని ఓ ఇంటివాడిని చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారన్న సమాచారం ఇటీవల లీకైంది. ఈ నేపథ్యంలో కాస్ట్ లీగా సకల సౌకర్యాలు ఉన్న ఇండివిడ్యువల్ ఇంటినే కొనుక్కోవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. తల్లిదండ్రులు సహా సోదరుడు ఆనంద్ సహా దేవరకొండ ఈ ఇంటిలోనే ఉంటాడట. అలాగే ఇంతకుముందు దేవరకొండ డాడ్ ఇందిరా నగర్ పరిసరాల్లో ఆ ఆఫీస్ ని మెయింటెయిన్ చేసేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా మారనుందట.
Please Read Disclaimer