బిగ్ బాస్ హోస్ట్ కి 200 కోట్ల పారితోషికమా?

0

బిగ్ బాస్ హోస్ట్ కి 200 కోట్ల పారితోషికమా?బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 12 సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం 13వ సీజన్ కు సల్మాన్ బాధ్యతలు వహిస్తున్నాడు. అయితే ఈ సీజన్ కు భాయ్ 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారన్నది బాలీవుడ్ లో చర్చంశనీయంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సల్మాన్ ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవరిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీజన్ -13 వరకూ ఆయన పారితోషికం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం జరుగుతోన్న సీజన్ కు వారానికి 13 కోట్లు అందుకుంటున్నాడుట. అంటే ఎపిసోడ్ కు 6.5 కోట్లు లెక్కన రెండు రోజులకు 13 కోట్లు అన్న మాట. తాజాగా ఇటీవలే ఆ షోను మరో ఐదు వారాల పాటు పొడిగించారు. దీంతో సల్మాన్ ఎపిసోడ్ కు 2 కోట్లు అదనంగా ఛార్జ్ చేస్తున్నాడుట. ఎపిసోడ్ కు 8 కోట్లు అయ్యిందిప్పుడు. అలా సల్మాన్ బిగ్ బాస్ కు అన్ని ఏపిసోడ్లు పూర్తయితే దాని ద్వారా అందుకుంటోన్న పారితోషికం 200 కోట్లు అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఓ వైపు ఎపిసోడ్ ఎపిసోడ్ ని హీట్ పెంచేస్తూ ఇంటి సభ్యులకు సల్మాన్ వార్నింగులు ఇస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.

ఓవైపు సినిమాలతోనే సల్మాన్ వార్షికాదాయం స్కైని టచ్ చేస్తోంది. సినిమాలు ఓవైపు వాణిజ్య ప్రకటనలు ఇంకోవైపు.. ఇప్పుడు బిగ్ బాస్ షో రూపంలో మరో వైపు అంతా ఆదాయమే. సల్మాన్ ప్రస్తుతం రాధే అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer