24 ముద్దులకు 23 ఫిక్స్!

0

నవంబర్ లో సినిమాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు తమ సినిమాలను సాధ్యమైనంత పోటీ లేకుండా మంచి థియేటర్లు దక్కేలా విడుదలను ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే హెబ్బా పటేల్ ఆదిత్ అరుణ్ జంటగా నటించిన 24 కిస్సెస్ రిలీజ్ డేట్ ని లాక్ చేసారు. నవంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికే ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం రేపగా అందులో కంటెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయనే అంచనాలో ఉంది ట్రేడ్.

మిణుగురులు సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి దీనికి దర్శకుడు కావడం ప్రధాన ఆకర్షణ. రావు రమేష్ పాత్ర స్పెషల్ గా డిజైన్ చేసినట్టు ట్రైలర్ లోనే చూపించారు. జోయ్ బారువా సంగీతం కూడా ప్లస్ గా నిలుస్తుందని యూనిట్ టాక్. కుమారి 21ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ కు దీని మీద గట్టి నమ్మకమే ఉంది. టైటిల్ ని బట్టి ఇదేదో కేవలం యూత్ ని టార్గెట్ ని చేసిన చిత్రం కాదని దాని నేపధ్యం వల్ల అలా పేరు పెట్టాల్సి వచ్చిందే తప్ప ఇది క్లీన్ ఎంటర్ టైనర్ అంటున్నాడు దర్శకుడు అయోధ్య కుమార్.

ఆ సమయంలో మరో చిన్న బడ్జెట్ చిత్రం హవా తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకే పోటీ లేదు కనక 24 కిస్సెస్ కు మంచి ఛాన్స్ ఉంటుంది. ముందు రోజు మాత్రం కొత్తవాళ్లతో వర్మ నిర్మాణంలో వచ్చిన భైరవ గీత కూడా బరిలో ఉంది. సో కంటెంట్ తో మెప్పిస్తే ఈ పోటీ పెద్ద సమస్య కాదు. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఆదిత్ హెబ్బాలకు 24 కిస్సెస్ ఎంత వరకు హెల్ప్ అవుతుందో మరో మూడు వారాల్లో తేలిపోతుంది.
Please Read Disclaimer