ట్రైలర్ టాక్: ము.. ము.. ముద్దంటే చేదా?

0

టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. ఒకవైపు దుబాయ్ లో సాహో కార్ స్మాషింగుల మేకింగ్ వీడియోతో సుజీత్ సోషల్ మీడియాలో హీట్ పెంచితే మరోవైపు మరో యువదర్శకుడు అయోధ్య కుమార్ తన జెన్ ఎక్స్ సినిమా ’24 కిస్సెస్’ ట్రైలర్ తో మరో రకమైన హీట్ పెంచుతున్నాడు. టైటిల్ కి తగ్గట్టే సినిమా బోల్డ్ గా ఉంటుందని ట్రైలర్ మనకు హింట్ ఇచ్చేసింది.

హీరో అదిత్ అరుణ్ హేబ్బా తో రిలేషన్ స్టార్ట్ చేస్తాడు.. కానీ అది ప్రేమో కాదో తెలియని కన్ఫ్యూషన్ లో ఉంటాడు. ఇక టైటిల్ కి తగ్గట్టే హాటు హాటు కిస్సులున్నాయి. 1..2..3..4 అంటూ 24 కౌంటు అనే కిస్సుల సెలబ్రేషన్ పాట కూడా ఉంది. కిస్సులయ్యాక పెళ్ళి టాపిక్ వస్తుంది కదా? కానీ అప్పుడు మాత్రం “నాకు ఈ ప్రేమ.. పెళ్ళి.. పిల్లలు మీద నమ్మకం లేదు” అంటాడు. “ప్రేమ వద్దు కానీ యూ వాన ఫ.. హర్” అనే ప్రశ్న హీరోను రావు రమేష్ క్యారెక్టర్ అడుగుతుంది. తర్వాత హీరో..హీరోయిన్ ల మధ్య గ్యాప్ రావడం ఇబ్బందులు రావడం జరుగుంది. ఒక షాట్ లో శవాన్ని కూడా చూపించారు. ఓవరాల్ గా కిస్సులే కాకుండా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉందనే ఫీల్ కలిగించారు.

సినిమాకు తగ్గట్టే మ్యూజిక్ ప్లెజెంట్ గా ఉంది. యూత్ సినిమా అయినా రావు రమేష్ క్యారెక్టర్ కు ఎక్కువ ప్రాధ్యానత ఉంది. కన్ఫ్యూషన్ లో ఉన్న హీరో ను గైడ్ చేసే రోల్ లా అనిపిస్తోంది. ఇక హెబ్బా తన ఇమేజ్ కు తగ్గట్టే ఏ మాత్రం అరమరికలు లేకుండా కిస్ ఆఫ్ లవ్ ను పంచింది. మీరు 1..2..3..4 అంటూ 24 కిస్సుల కౌంటుకు శాంపిల్ చూడండి.
Please Read Disclaimer