హంగామా అంతా 35-45 ఆంటీలదే.. ఎందుకబ్బా?

0

ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్ల వాడకం విస్తృతం కావడంతో అభివృద్ధి చెందిన దేశాలలోనే కాకుండా భారతదేశంలో కూడా సోషల్ మీడియా అందరి జీవితాలలో భాగం అయిపోయింది. ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్ లో ఏదో ఒకటి వాడని వారు దాదాపుగా ఉండరు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా యూట్యూబ్ లో వీడియోలు చూడడం అనేది కనీస పరిజ్ఞానంగా మారింది. అయితే ఈ సాంకేతికత వెల్లువలో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి.

కన్నాంబ..సావిత్రి జెనరేషన్ పక్కన పెడితే గతంలో హీరోయిన్లకు ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా టచ్ లో ఉండే ఛాన్స్ ఉండేది కాదు. దీంతో వారు ఎక్కువగా ఫ్యాన్ లెటర్స్ పై ఆధారపడేవారు. ఇక.. గ్లామర్ ఒలికించి అందరి దృష్టిని ఆకర్షించాలంటే మాత్రం ఏదో ఒక ప్రింట్ మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్ పేజ్ 3 లోనో వారి అందాలు ధారపోయాల్సి వచ్చేది. అయితే అదంతా అంత సులువైన వ్యవహారం కాదు. ఎవరైతే ట్రెండింగ్ లో ఉన్నారో వారికి మాతమే మీడియాలో స్పేస్ దక్కేది. మరి ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్లు.. మాజీ భామలు.. పెద్దగా ఫాలోయింగ్ లేని బ్యూటీలు.. హీరోయిన్ గా ఒకటి ఆరా సినిమాలతోనే తట్టాబుట్టా సర్దుకున్న హాటీలు ఏం చేయాలి?

సరిగ్గా ఇలాంటి వారికే సోషల్ మీడియా ఒక వజ్రాయుధం లాగా దొరికింది. ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్.. ఇంకా లేటెస్ట్ అయితే టిక్ టాక్ లను ఈ భామలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్లకు ఎలాగూ క్రేజ్ ఉంటుంది కాబట్టి వారిని ఫ్యాన్స్.. మీడియా..నెటిజన్లు ఫాలో అవుతారు. అయితే లైమ్ లైట్ లో లేని ఈ భామ లు సోషల్ మీడియాలో దుమ్ము దుమారం సృష్టిస్తున్నారు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు వీరి తారకమంత్రం బికినీ ఫోటో షూట్లు.. హాటు హాటు అందాల ప్రదర్శనలు. మరి ఇలా చేసేవారిలో 35-45 ఏళ్ళ వయసున్న భామలే ఎక్కువగా ఉండడం గమనార్హం.

గతంలో హీరోయిన్ల వయసు ముప్పై టచ్ చేస్తేనే ‘ఆంటీ’ అనే ముద్ర పడిపోయేది. కానీ ఇప్పుడు ఈ ముప్పైల.. నలభైల భామలు కఠినమైన కసరత్తులు చేస్తూ.. స్ట్రిక్టు డైట్ ఫాలో అవుతూ ఖజురహో శిల్పాలలాగా తమ శరీరాలను కాపాడుకుంటున్నారు. అలా తీరైన ఒంపుసొంపులతో శరీరాలను మెయింటెయిన్ చేస్తూ ఘాటు ఫోటో షూట్లలో ఎడాపెడా పాల్గొంటున్నారు. వీరి ఫోటోలకు లక్షల్లో లైకులు.. వేలల్లో కామెంట్లు వస్తుండడంతో మరింతగా రెచ్చిపోయి.. రెట్టించిన ఉత్సాహంతో ఫోటోషూట్ల హాటు ఉద్యమాలను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియానే లేకపోతే ఈ వయసు మళ్ళిన భామలను ఎవరూ పట్టించుకోరేమో. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ బ్యూటీలు అందాలకు కొత్త అర్థం చెప్తున్నారు. మలైకా అరోరా.. మందిరా బేడి.. శిల్పా శెట్టి.. అమీషా పటేల్.. బిపాషా బసు.. పూజా బాత్రా లాంటి నలభైల భామలు.. రాయ్ లక్ష్మి.. శ్రియ.. నేహా శర్మ.. షమ సికందర్.. లాంటి ముప్పైల భామలు ఈ లిస్టులో ఉన్నారు. ఈ పేర్లు రాసుకుంటూ పోతే లిస్టు ఇంకా పెద్దదవుతుంది. నిజానికి సోషల్ మీడియాలో ఈ భామలను విమర్శించే వారు కూడా ఉన్నారు కానీ ఈ బ్యూటీల అందాల విందు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ కాచుక్కూచునే చకోరపక్షులకు కొదవేమీ లేదు. ఈ హాటు ఫోటోలతో ఆ భామలకు ఫుల్లు పబ్లిసిటీ..మరుగున పడిపోకుండా లైమ్ లైట్ లో ఉండడం జరుగుతుంది. నెటిజన్లకేమో కళాపోషణ..!
Please Read Disclaimer