నలభైల్లో బికినీల మోతెక్కిస్తున్న బాలీవుడ్ భామలు!

0

శరీరాన్ని ఫిట్ గా మెయింటెయిన్ చేయడం ఒక కళ. అందరికీ అబ్బే కళ ఎంతమాత్రం కాదు. చాలామంది అలా మెయింటెయిన్ చేతకాక తమ ఒంటి తీరు ఇదని.. మేనమామ పోలికని.. నానమ్మ పోలికని సరిపెట్టుకుంటారు. కొందరేమో థైరాయిడ్ అని.. ఆండ్రాయిడ్ అని..మరొకటని సాకులు చెప్తారు. నిజ్జంగా నిజ్జం ఏంటంటే.. ఇవన్నీ ఉండి కూడా ఫిట్ గా మెయింటెయిన్ చేసే వారు చాలామందే ఉన్నారు. అలా చేసేందుకు మొదటగా కావాల్సింది ఫిట్ గా ఉండాలనే తపన. రెండవది.. జిహ్వ చాపల్యం పై కాస్త అదుపు ఉండడం. మూడవది క్రమం తప్పకుండా ఎక్సర్ సైజు చెయ్యడం. ఇవన్నీ ఉంటేనే వయసుతో సంబంధం లేకుండా.. రోగాలతో సంబంధం లేకుండా ఫిట్ నెస్ మెయింటెయిన్ చెయ్యగలరు.

టిఫిన్ కోసం పది పెసరట్లు లాగించి ఒక పెద్ద జగ్గు బూస్టు తాగే అలవాటు ఉండి కూడా నాకు సిక్స్ ప్యాక్ కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? మిగతా విషయాల్లో ఫిలిం సెలబ్రిటీలు జనాలకు ప్రేరణగా నిలుస్తారో లేదో తెలియదు కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం దాదాపుగా ఫిలిం స్టార్స్ అందరూ సాధారణ జనాలకు ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు. బాలీవుడ్ సంగతే తీసుకుంటే టాప్ స్టార్స్ అందరూ ఫిట్ గా ఉంటారు. సల్మాన్.. షారూఖ్.. ఆమిర్.. అక్షయ్.. హృతిక్.. మీరు ఎవరినైనా తీసుకోండి. వీరిలో దాదాపు అందరి వయసు నలభై పైనే. ఇక భామల విషయం తీసుకుంటే బాలీవుడ్ లో నలభై నుంచి యాభైలోపు భామలు ఫిట్ నెస్ కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. బికినీలు ధరించి మరీ తమ పర్ఫెక్ట్ షేపులను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. ఈ భామలు అందరూ యోగా ఎక్స్ పర్ట్స్ కావడం గమనార్హం.

మలైకా అరోరా వయసు 45 ఏళ్ళు.. అయినా ఫిట్ నెస్ విషయంలో ఇప్పటికీ పాతికేళ్ళ వయసున్న భామలతో పోటీ పడగలదు. బికినీ వేయాలంటే మలైకానే ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. మరో భామ మందిరా బేడి వయసు 47 సంవత్సరాలు. ఈమధ్యే ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. వయసు ఇరవై ఏడా.. నలభై ఏడా అనే విషయం అర్థం కాక చాలామంది జుట్టు పీక్కున్నారు. ఇంకో భామ శిల్పా శెట్టి వయసు 44. ఈ బ్యూటీ వయసు కూడా ఎప్పుడూ ఇరవై ఏళ్ళ క్రితమే ఆగిపోయింది.

పూజా బాత్రా విషయమే తీసుకుంటే వయసు 42. బికినీ వేసిందంటే కెవ్వు కేకే. ఇక అమీషా పటేల్ విషయమే తీసుకుందాం.. వయసు 43 మొదటి నుంచి కాస్త చబ్బీగా కనిపించే బ్యూటీనే కానీ ఇప్పటికీ ఒక గ్రాము తగ్గకుండా పెరక్కుండా అదే ఫిగర్ మెయింటెయిన్ చేస్తోంది. జనాలు అమీషాను పట్టించుకోవడం లేదు కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ నంబర్ వన్ను. ఇక మరో హాటు భామ మల్లికా షెరావత్.. వయసు 42.. ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అదేరకంగా ఉంది. పొరపాటున ఎక్కడైనా అమృతం దొరికితే తాగేసిందేమో కానీ ఒక్క గ్రాము కూడా పెరగదు. ఈ లిస్టు ఇంకా చాలా చాలా ఉంది. వీరిని ఇన్ స్పిరేషన్ తీసుకోవాలి అంటే అందరూ ఈ భామల్లా బికినీలు వేసుకొని తిరగమనే ఉద్దేశం కాదు. అంత ఫిట్ గా మెయింటెయిన్ చేసేందుకు ప్రయత్నించాలి అని. ఎందుకంటే ఫిట్ నెస్ ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు.
Please Read Disclaimer