100 మంది దళపతులు ఒకే ఫ్రేమ్ లోనా?

0

100 మంది భాషాల్ని ఒకేసారి చూసినట్టు.. వంద మంది దళపతులను ఒకేచోట చూసినట్టు.. వంద మంది కబాలీల్ని వంద మంది కాలాల్ని ఒకేసారి ఒకేచోట చూసినట్టు.. అదరహో అన్నట్టే ఉందీ డీపీ. రోబో చిత్రంలో రకరకాల గెటప్పుల్లో రజనీ ఆహార్యాన్ని తలుచుకుంటే అభిమానుల పరవశం పీక్స్ కి చేరుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ సినిమా హిస్టరీలోనే ఒకే ఒక్కడు రజనీ. అలాంటి గ్రేట్ హీరోని వేరొకరిని చూడలేం.

18ఆగస్టు 1975 తేదీన ఒక సాధారణ బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ వెండితెర నటుడిగా పరిచయం అయ్యారు. `అపూర్వ రారంగల్` అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఇండియాలోనే గొప్ప స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకున్నారు. 2019 ఆగస్టు 18 నాటికి నటుడిగా అతడి కెరీర్ 44 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా హ్యాష్ 44 ఇయర్స్ ఆఫ్ రజనీయిజమ్ పేరుతో ఒక కామన్ డీపీ ఫోటోతో వైరల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ పోస్టర్ కోసం రజనీ నటించిన కొన్ని ఐకానిక్ పాత్రల్ని ఎంచుకున్నారు. వాటితో ఇంత అద్భుతమైన డీపీని రూపొందించారు.

రజనీకి రజనీ మాత్రమే సాటి. వేరొకరు అతడి స్థాయిని టచ్ చేయడం అన్నది అసాధ్యం. అందుకే ఈ డీపీని అలా రూపొందించారు అభిమానులు. మొత్తానికి ఈ డీపీ సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది వైరల్ గా. ఈ ఆదివారం రజనీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలనున్నారు.
Please Read Disclaimer