49రోజులే.. కౌంట్ డౌన్ స్టార్ట్!!

0

ఇంకో 50 రోజులు అయినా లేదు. జస్ట్ 49 రోజులే. కౌంట్ డౌన్ స్టార్ట్.. భూమండలం షేకయ్యే రోజు రాబోతోంది. అవును నిజమే.. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 2.ఓ (రోబో2) ప్రకంపనాలకు రంగం సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ గడగడలాడే ఆ రోజు నవంబర్ 29 కాబోతోందా?!

ఓవైపు శంకర్- రజనీ అభిమానుల్లో టెన్షన్. మరోవైపు కిలాడీ అక్కీ అభిమానుల్లో టెన్షన్ టెన్షన్. ఇక ఎమీజాక్సన్ ఫ్యాన్స్ అయితే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. `ఐ` తర్వాత మరోసారి ఎమీ విజువల్ ట్రీట్ ని చూడాలని తహతహలాడుతున్న వీరాభిమానులు ఉన్నారు. వీటన్నిటినీ మించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెబుతున్న 2.ఓ లో వీఎఫ్ ఎక్స్- గ్రాఫిక్స్ కి సంబంధించిన విజుల్ గ్లింప్స్ ఏ రేంజులో ఉండబోతున్నాయో చూడాలన్న కుతూహాలం అంతకంతకు పెరుగుతోంది.

హాలీవుడ్ లో `ఐరోబో` ఓ సంచలనం. రోబోటిక్ టెక్నాలజీపై వచ్చిన ఈ సినిమానే శంకర్ `రోబో` తీసేందుకు స్ఫూర్తి. అప్పట్లో సుజాత రంగరాజన్ లాంటి టెక్ ప్రొఫెసర్ కం నవలా రచయిత అండదండలతో రోబో కథను సృష్టించుకున్నాడు. అయితే ఈసారి మాత్రం రంగరాజన్ లేనేలేరు. ఆయన బదులుగా మరో నవలా రచయిత – జర్నలిస్టు జేయ మోహన్ 2.ఓ కథ అందించారు. అందుకే ఈసారి పాత మ్యాజిక్ మళ్లీ రిపీటవుతుందా.. అవ్వదా? అన్న ఉత్కంఠ నెలకొంది. 2.ఓ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ కానుంది. ఈలోగానే రెండు వారాలు ముందుగానే మరో మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` రికార్డులు తేలిపోనున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 7న ఈ చిత్రాన్ని అమీర్ – అమితాబ్ బృందం రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ రికార్డులు – రజనీకాంత్ రికార్డులను అభిమానులు పోల్చి చూడడం ఖాయం. అమీర్-అమితాబ్ మ్యాజిక్ తో థగ్స్ రికార్డులు షురూ అయితే.. రజనీ-కిలాడీ మ్యాజిక్ తో `2.ఓ` ఎలాంటి రికార్డులు సృష్టించనుందో వేచి చూడాల్సిందే. 49 రోజులే.. ఇక కౌంట్ డౌన్ మొదలైంది.