5 కోట్లు ఖర్చు పెట్టాం.. చీప్ ప్రొడక్షన్ కాదు!

0

యువ హీరో విజయ్ దేవరకొండ నిర్మతగా మారి కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు విజయ్ తండ్రిగారు వర్ధన్ దేవరకొండ సహనిర్మాతగా వ్య్వహరించారు. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంత కామెడీ వర్క్ అవుట్ అయింది కానీ ఒక సినిమాకు అవసరమైన స్టఫ్ కథలో లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చీప్ గా ఉన్నాయనే దాదాపుగా అందరూ అంటున్నారు. రివ్యూలలో కూడా చాలామంది ఈ అంశాన్ని ప్రస్తావించారు. సాధారణ ప్రేక్షకులు కూడా చాలామంది అలానే అభిప్రాయ పడ్డారు. సినిమా చూస్తే రెండు కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ అయి ఉండదనే టాక్ వినిపించింది. బిజెనెస్ కోసమే విజయ్ ఈ సినిమా బడ్జెట్ ను పెంచి చెప్పాడని కూడా కామెంట్లు వినిపించాయి. ఇదే విషయంపై రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఫాదర్ ను ప్రశిస్తే.. ఆయన నిర్మాణ విలువల్లో ఏమాత్రం రాజీపడలేదని సినిమాను వెనకేసుకొచ్చారు.

‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకు దాదాపు రూ. ఐదు కోట్లు ఖర్చుపెట్టామని.. ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదని అన్నారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా విజువల్స్ డల్ గా కనిపిస్తున్నాయని చెప్పారు. డీఐ(DI) చేసే సమయంలో ఏర్పడిన సమస్య ఒక కారణమని.. ఎక్కువ సీన్ల ను నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించడం వల్ల కూడా అలా అనిపించి ఉండొచ్చని తెలిపారు. కారణాలు ఏవైనా సినిమా మాత్రం రిచ్ గా కనపడలేదన్నది మాత్రం వాస్తవం
Please Read Disclaimer