RRRలో 8 పాటలు.. తెలుగు వెర్షన్ వరకేనా?

0

పాన్ ఇండియా సినిమాలకు పరిమితులు ఉంటాయి. పాన్ ఇండియా కథలు.. పాన్ ఇండియా స్ట్రక్చర్ కి లిమిటేషన్స్ తప్పనిసరి. ఇష్టానుసారం సమయం తినేసేలా పాటలు కుదరదు. సందర్భానుసారం లిమిట్ పాటించాల్సి ఉంటుంది. సినిమా నిడివి పరంగానూ చిక్కులుంటాయి. ఇలాంటి చిక్కుల వల్లనే సైరా లాంటి భారీ చిత్రం నుంచి కోట్లు ఖర్చు చేసిన వాటిలోంచి చాలానే ఎడిట్ చేశారు. చిరు-తమన్నాలపై కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన ఓ ఇంపార్టెంట్ పాటనే తొలగించామని నిర్మాత చరణ్ తెలిపారు.

అయితే ఇప్పుడు దర్శకధరుని RRRలో ఏకంగా ఏడెనిమిది పాటలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. అసలే దేశ భక్తి సినిమా కావడంతో ఇందులో స్ఫూర్తి నింపే.. ఉద్రేకాన్ని పెంచే దేశ భక్తి గీతాలకు కొదవేమీ ఉండదని.. పైగా ఇద్దరు స్టార్ల కు పాటల్ని షేర్ చేయాల్సొచ్చిందని సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సుద్ధాల అశోక్ తేజ మూడు పాటలు రాశారు. బాణీలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయట.

అయితే పాన్ ఇండియా కేటగిరీ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ లో అన్ని పాటలుంటాయా? ఎనిమిది పాటలు కేవలం తెలుగు వెర్షన్ ని దృష్టిలో పెట్టుకునేనా? లేక అన్ని వెర్షన్లలో ఉంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిట్ సాంగ్స్ కట్ సాంగ్స్ వరకూ ఓకే కానీ అన్ని పూర్తి నిడివి పాటలు అయితే కష్టమే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాని తెలుగు-తమిళం-హిందీ సహా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గట్టే దాదాపు 250-300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆలియా సీత పాత్రలో నటిస్తోంది. 2020 జూలై 30న సినిమా రిలీజ్ కానుంది.




Please Read Disclaimer