శర్వా ‘శ్రీకారం’ బర్త్ డే గిఫ్ట్ బాగుంది

0

నేడు యంగ్ హీరో శర్వానంద్ తన బర్త్ డేను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘శ్రీకారం’ చిత్రంకు సంబంధించి 19 సెకన్ల వీడియోను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. చిత్రంలో శర్వానంద్ ఎలా కనిపించబోతున్నాడో ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా చూపించిన చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి ఇంకాస్త డీటైల్డ్ గా చూపించారు.

శర్వానంద్ ఈ చిత్రంలో యువ రైతుగా కనిపించబోతున్నట్లుగా ఈ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో యువ రైతు పాత్రలో శర్వానంద్ ను చూస్తుంటే బాగుందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కు ఈ వీడియో మంచి బర్త్ డే గిఫ్ట్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాను 14 రీల్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీకారం చిత్రంలో ప్రియాంక అరుల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. జాను చిత్రంతో హిట్ కొట్టాలనుకున్న శర్వానంద్ కు నిరాశే మిగిలింది. అందుకే శ్రీకారంపై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ చూస్తుంటే ఇది మరో శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ కు సక్సెస్ ను ఇచ్చేలా ఉందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ గింపుల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే టీజర్ కూడా తీసుకు వచ్చే ఆలోచనలో యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-