90ML ఫస్ట్ లుక్ తో వచ్చిన ఆరెక్స్ హీరో

0

మొదటి సినిమా ‘RX100′ తోనే మంచి గుర్తింపు సాధించిన యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ స్పీడ్ మామూలుగా లేదు. వరసబెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కార్తికేయ పర్సనాలిటీ.. లుక్స్ ఈ జెనరేషన్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండేడంతో ఆఫర్లు కూడా అలానే వస్తున్నాయి. ఆల్రెడీ చేతిలో ఉన్న సినిమాలు కాకుండా కార్తికేయ నటిస్తున్నమరో సినిమా ’90 ML’ ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కంటే ముందు మాట్లాడుకోవల్సింది ఈ సినిమా టైటిల్ గురించే. డౌట్ లేకుండా ఇది బోల్డ్ టైటిల్ అని చెప్పాలి. 90ఎం ఎల్ అనేది నార్మల్ కొలత కదా అని కొందరు పప్పుసుద్ధలు అనుకోవచ్చేమో కానీ 90ML కు మన సభ్యసమాజంలో ఉన్న మీనింగ్ అదైతే కాదు. లిక్కర్ కొలతలలో 90ML ముఖ్యమైంది. దానికి తోడు ఈ సినిమా క్యాప్షన్ “యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్”.. తెలుగులో దీన్ని అధికారిక తాగుబోతు అని అనువాదం చేసుకోవాలి. ఈ టైటిల్.. క్యాప్షన్ చూస్తుంటే పొరపాటున కార్తికేయ పాత్ర వైన్ టేస్టర్ లాంటి ప్రొఫెషన్ లో ఉంటాడేమో అనే అనుమానం వస్తోంది.. ఇది జస్ట్ వైల్డ్ గెస్ మాత్రమే లెండి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మద్యం బాటిళ్ళ కుప్పపై హయిగా కాలిమీద కాలు వేసుకొని పడుకున్న కార్తికేయ చిరునవ్వులు చిందిస్తున్నాడు.

ఈ సినిమాతో నూతన దర్శకుడు శేఖర్ రెడ్డి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కార్తికేయ హోమ్ బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ బ్యానర్ పైనే ‘RX100’ నిర్మించారనే సంగతి తెలిసిందే. సేమ్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండవ సినిమాతో కార్తికేయకు మరో విజయం దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే కార్తికేయ విలన్ గా నటించిన నాని కొత్త సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ త్వరలో రిలీజ్ కు రెడీగా ఉంది.




Please Read Disclaimer