90ML తర్వాత మరొకటి లైన్లో పెట్టిన కార్తికేయ

0

‘RX100′ లాంటి సెన్సేషనల్ హిట్ తో హీరోగా పరిచయం అయ్యాడు కార్తికేయ. అలాంటి డ్రీం డెబ్యూ పెద్ద పెద్ద ఫిల్మీ కుటుంబాల వారసులకు కూడా దక్కడం లేదు. నటన విషయంలో ఓకే అనిపించుకున్న కార్తికేయకు పర్ఫెక్ట్ ఫిజిక్.. మంచి లుక్స్ ఉండడంతో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఈమధ్య కార్తికేయ నటించిన సినిమాలు నిరాశపరిచాయి. దీంతో కార్తికేయ తన ఆశలన్నీ ’90ML’ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్మకంగా ఉన్నాడట.

’90ML’ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. వచ్చే నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కార్తికేయ మరో ఇంట్రెస్టింగ్ సినిమాను ఎంచుకున్నాడట. ఈ సినిమా వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కా హిట్ మెటీరియల్ అనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న నవతరం యువ హీరోలలో కాస్త క్రేజ్ ఉన్న హీరో కార్తికేయ. మంచి స్క్రిప్ట్ లపై దృష్టి సారిస్తే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి రాబోయే సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.




Please Read Disclaimer