96 రీమేక్ ఎట్టకేలకు అప్డేట్

0

తమిళ్ లో సూపర్ హిట్టయిన ’96’ కి సంబంధించి ఏరికోరి మరీ రీమేక్ రైట్స్ తెచ్చుకున్నాడు దిల్ రాజు. క్యాస్టింగ్ ఎవరు ..? డైరెక్టర్ ఎవరు అనే దానిమీదే కొన్ని రోజులు డిస్కర్షన్ నడిచింది. ఫైనల్ గా తమిళ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేతిలోనే రీమేక్ కూడా పెట్టారు. ఆ తర్వాత శర్వానంద్ – సమంత బోర్డ్ లోకి వచ్చారు. అక్కడి నుండి సినిమా మీద హైప్ క్రియేట్ అయింది.

కట్ చేస్తే షూటింగ్ దగ్గర నుండి ఇంత వరకూ ఒక్క అప్డేట్ కూడా బయటికి వదలకుండా సైలెంట్ షూటింగ్ పూర్తి చేసారు. ఇంత ప్రమోషన్ గురించి ఆలోచించని రాజు ఎట్టకేలకు సినిమాకు సంబంధించి ప్రమోషన్ మొదలు పెట్టబోతున్నాడు. ముందుగా టైటిల్ తో ఫస్ట్ లుక్ ప్లాన్ చేసారు. దీనికి సంబంధించి ఓ అప్డేట్ వదిలారు. జనవరి 7న ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

ఫస్ట్ లుక్ నుండి మొదలు పెట్టి రిలీజ్ వరకూ వరుస అప్డేట్స్ తో సినిమా మీద బజ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. మరి రాజు గారు ఏరి కోరి తెచ్చుకున్న ఈ రీమేక్ ఆయనకీ ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. సినిమాను మార్చ్ లో సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
Please Read Disclaimer