దీదీ మాయావతి బయోపిక్ లో బాలన్

0

బయోపిక్ ల సీజన్ ఇది. వరుసగా అన్ని రంగాల ప్రముఖులపైనా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో రాజకీయ నాయకుల బయోపిక్ లు అంతకంతకు వేడి పెంచుతున్నాయి. ఎన్టీఆర్ – వైయస్సార్ – థాక్రే – మన్ మోహన్ సింగ్ లపై సినిమాలు ఇప్పటికే రిలీజయ్యాయి. తదుపరి ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ లోగానే మరో హాట్ అప్ డేట్ అందింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం అయిన.. మహిళా నేత.. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బిఎస్పి) అధినేత్రి .. దీదీ మాయావతి బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జాలీ ఎల్.ఎల్.బి ఫేం సుభాష్ కపూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

ఈ బయోపిక్ లో టైటిల్ పాత్ర పోషించబోయేది ఎవరు? అంటే తాజాగా ఓ అదిరిపోయే లీకు అందింది. టైటిల్ పాత్ర కోసం ఏడెనిమిది పేర్లను పరిశీలించిన సుభాష్ కపూర్ చివరికి విద్యా బాలన్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథాంశం ఎలా ఉంటుంది? అని దర్శకుడిని ప్రశ్నిస్తే … అందుకు సంబంధించి ఎలాంటి లీకును ఇవ్వలేనని ఖరాకండిగా చెప్పేశారు.

ఇప్పటికే విద్యాబాలన్ పలు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. దేశ రాజకీయాల్లో గాంధీల వారసత్వానికి ఎదురేలేని హవాని ఆపాదించిన ఏకైక మహిళా ప్రధాని – జాతీయ కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీ పాత్రలోనూ విద్యాబాలన్ నటిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు మాయావతి పాత్రకు ఎంపికవ్వడం ఓ పెను సంచలనమేనని చెప్పాలి. ఇదే గాక బాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో అత్యంత కీలకమైన బసవతారకం పాత్రలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో `పింక్` రీమేక్ లోనూ బాలన్ కథానాయికగా నటిస్తోంది. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Please Read Disclaimer