సెన్సార్ వారు షాక్ అయ్యి ‘ఎ’ ఇచ్చారట!

0

ఈ జెనరేషన్ హీరోయిన్స్ లో చాలామందికి గ్లామర్ ఉంటే నటన ఉండదు.. నటన కనుక ఉంటే గ్లామర్ అసలు ఉండదు. రెండు సరైన కాంబినేషన్ లో ఉన్న నటీమణులు అరుదుగా ఉంటారు. అలాంటి నారీమణి సమంతా అక్కినేని. ఎలాంటి పాత్ర చేసినా అందులో లీనమైపోవడం సామ్ స్పెషాలిటి. అల్ట్రా స్టైలిష్ గా ఉండే సమంతా మట్టి పిసుక్కునే రామలక్ష్మిగా నటించడం.. తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలోనే తన టాలెంట్ తెలిసిపోతుంది. ఇప్పుడు మరో నాలుగు అడుగులు ముందుకేసి బోల్డ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను షాక్ చేసేందుకు రెడీ అవుతోందట.

విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ లో సమంతా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో కథ హీరో-హీరోయిన్ ఫార్మాట్ లో ఉండదని.. ప్రతి పాత్ర బోల్డ్ గా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. విజయ్ సేతుపతి హిజ్రాగా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక వేశ్య పాత్రలో నటిస్తోంది. రమ్య కృష్ణ పాత్ర షాక్ ఇవ్వడం గ్యారెంటీ అనీ ఇప్పటికే టాక్ ఉంది. ఇదిలా ఉంటే సమంతా మాత్ర కూడా షాకింగ్ గానే ఉంటుందట. అక్రమ సంబంధం పెట్టుకునే వివాహిత పాత్రలో నటిస్తోందట. అంతేకాదు భర్త తో కలిసి అక్రమ సంబంధం ప్రియుడిని చంపేసి.. అతడి డెడ్ బాడీని మాయం చేసే పాత్ర పోషించిందట. ‘రంగమ్మా మంగమ్మా’ అంటూ పల్లెటూరి పడుచులా అల్లరితనంతో చిలిపిగా పాట పాడిన రామలక్ష్మి పాత్రకు ఈ పాత్రకు ఎంత తేడా ఉందో తెలిసిందిగా.

ఇక విజయ్ సేతుపతి పాత్ర ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉంటుందట. హిజ్రాల సమస్యలను చర్చిస్తూ.. సమాజం నుండి వారు ఎదుర్కొనే హింసను బోల్డ్ గా చూపించారట. ఇలాంటి బోల్డ్ సినిమా కాబట్టే సెన్సార్ వారు కూడా షాక్ అయ్యి ‘సూపర్ డీలక్స్’ కు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ శుక్రవారమే తమిళ వెర్షన్ రిలీజ్ అవుతోంది. త్వరలోనే ఈ బోల్డ్ సినిమాను చూసే ‘అదృష్టం’ తెలుగు ప్రేక్షకులకు కూడా దక్కే అవకాశం ఉంది.
Please Read Disclaimer