ఆ దర్శకుడు నన్ను దారుణంగా రేప్ చేశాడు

0

ఇప్పుడిప్పుడు జరిగిన ఘోరాలకే దిక్కులేదు. ఇక 45 ఏళ్ల క్రితం జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు బయటపెడితే ఎవరు నమ్ముతారు చెప్పండి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ రోమన్ పోలన్‌స్కీ తనను రేప్ చేశాడని ఫ్రాన్స్‌కి చెందిన నటి వాలెంటైన్ తాజాగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. అయితే ఈ ఘటన 45 ఏళ్ల క్రితం జరిగిందట. అయితే రోమన్ డైరెక్ట్ చేసిన ‘జెక్యూస్’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్రాన్స్‌కి చెందిన ఆర్మీ అధికారిని ఎలా చిత్రహింసలు పెట్టారు అన్న నేపథ్యంలో రోమన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే చిన్న పిల్ల అని కూడా చూడకుండా 18 ఏళ్ల వయసులో తనను రేప్ చేసిన రోమన్, ఇప్పుడు నీతి, న్యాయం నేపథ్యంలో సినిమా ఎలా తెరకెక్కించారు అని వాలెంటైన్ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాను తీసే హక్కు రోమన్‌కు లేదని అందుకే 45 ఏళ్ల తర్వాత మీడియా ముందు ఈ విషయాన్ని బయటపెట్టాలనుకున్నానని పేర్కొన్నారు. 1978లో రోమన్ అమెరికాకు చెందిన 13 ఏళ్ల బాలిక ను రేప్ చేశాడు. ఆ నేరాన్ని ఒప్పుకున్న ఆయన అమెరికా నుంచి ఫ్రాన్స్‌కు పారిపోయారు. అయితే.. తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రోమన్‌ న్యూయార్క్‌లో ఉండేవాడని వాలెంటైన్ తెలిపారు. అవకాశం ఇస్తానని స్విట్జర్లాండ్‌‌కు రమ్మని చెప్పి అక్కడ ఉన్న తన ఇంట్లో తనను బంధించి హింసించాడని వాపోయారు. తానంతట తానే ఒప్పుకునేంతవరకు రోమన్ టార్చర్ పెట్టాడని తెలిపారు. కొన్ని రోజుల పాటు తనను చాలా దారుణంగా రేప్ చేశాడని తెలిపారు.

ఆ సమయంలో రోమన్‌తో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారిలో ఒకరు రోమన్‌ ప్రేయసని కూడా చెప్పారు. 1980ల్లో పలు చిత్రాల్లో నటించిన వాలెంటైన్ రేప్ జరిగిన ఇన్నేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వివాదాస్పదమైంది. రోమన్ తనను రేప్ చేసినట్లు లాస్ ఏంజెల్స్ పోలీసులకు, ఫ్రెంచ్ ప్రథమ మహిళ బ్రిగెట్ మాక్రోన్‌కు ఎన్నో లెటర్లు రాశానని, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై రోమన్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. 45 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి వాలెంటైన్ ఎవ్వరికీ చెప్పలేదని ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రోమన్ అంటున్నారని వెల్లడించారు.
Please Read Disclaimer