తకిట తకిట: మంచి ఊపులో తేజు డీజె

0

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘తకిట తకిట’ అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేసిది ‘ప్రతిరోజూ పండగే’ టీమ్.

ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. తకిట తకిట పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్.. గీతామాధురి పాడారు. తకిట తకిట అంటూ ప్రారంభమై ‘తకిట తధిమి తకిట తధిమి కొట్టర డీజె.. తకిట తధిమి తకిట తధిమి పుట్టిన రోజే’ అంటూ మంచి ఊపులోకి వెళ్తుంది. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. మనం రోజూ మాట్లాడుకుంటే పదాలతోనే పాటకు సాహిత్యం అందించారు. డీజె పార్టీలలో ప్లే చేసే పాట తరహాలో థమన్ ట్యూన్ అందించగా రాహుల్ గీతామాధురి ఈ పాట ను ఫుల్ జోష్ లో పాడారు. మాస్ ప్రేక్షకులకు.. యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది.

పాట వీడియో లో రాహుల్ సిప్లిగంజ్ సెల్ఫీ వీడియో తీయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సత్యరాజ్ బర్త్ డే పార్టీలో తేజు.. రాశి ఖన్నా అందరూ కలిసి ఉన్న విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియోలో తేజు వేసిన ఒక స్టెప్ కూడా బాగుంది. ఈ సాంగ్ హిట్ కావడం దాదాపు గ్యారెంటీనే!
Please Read Disclaimer