యువ హీరోలకు ఒకప్పటి స్టార్ హీరో సవాల్

0

తమిళ సీనియర్ హీరో శరత్కుమార్ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్గా మారింది. కండలు తిరగిన దేహంతో ఆయన కసరత్తులు చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించబోయే ‘పొన్నియన్ సెల్వం’ చిత్రం కోసం శరత్కుమార్ కఠోర వ్యాయామం చేసి కండలు పెంచుతున్నారు. ఈ ఫొటోలో శరత్ కుమార్ పొడవైన గడ్డం మీసాలతో డిపరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే థాయ్ల్యాండ్లో తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తిచేసుకున్నది. ఏడు మాసాల విరామం తర్వాత మళ్లీ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నది.

ఈ చిత్రంలో విక్రమ్ కార్తి శరత్కుమార్ ప్రభు పార్థిబన్ నిళల్గళ్ రవి రెహ్మాన్ జయరామ్ ఐశ్వర్యరాయ్ త్రిష తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రూ. 800 కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నటీనటులంతా తమ పాత్రలకు అనుగుణంగా గెటప్లు మార్చుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం త్రిష గుర్రపుస్వారీ నేర్చుకున్నది.

66 ఏళ్ల వయసులో శరత్కుమార్ ఈ సినిమా కోసం కండలు పెంచడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. యువ హీరోలో ఆయన లుక్ చూసి షాకవుతున్నారు. సిక్స్ ప్యాక్ కండలు పెంచడం మీరే కాదు.. మేం కూడా చేయగలమంటూ ఆరు పదులు దాటిన ఈ హీరో యువ హీరోలకు సవాల్ విసురుతున్నాడు.