మెగాస్టార్ ఫ్యామిలీ క్లాసిక్ డేస్ లుక్

0

క్లాసిక్ డేస్ జ్ఞాపకాల్ని మర్చిపోలేరు ఎవరూ. నాటి జ్ఞాపకాల్ని ఫోటోల రూపంలో పదిలపరుచుకుంటే నేటికీ ఆ మధురస్మృతుల్ని తిరిగి గుర్తు చేస్తుంటాయి. అలాంటి అరుదైన ఫోటో ఒకటి తాజాగా మెగాభిమానుల ముందుకు వచ్చింది. 80ల నాటి ఈ క్లాసిక్ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ తో పాటు చిన్నారి రామ్ చరణ్.. పెద్ద కుమార్తె సుస్మిత ఉన్నారు. ఇంటిల్లిపాదీ అందరూ కొత్త దుస్తులు ధరించి పూజా కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఫోటోలో సుస్మిత పూజాకార్యక్రమాలు నిర్వహిస్తుంటే చరణ్ ని ఎత్తుకుని సురేఖ ఆ పక్కనే ఆ పూజలో పాల్గొన్నారు. ఆ మొత్తం ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరంజీవి కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఆ జంటకు సుశ్మిత- చరణ్ – శ్రీజ వారసులుగా జన్మించారు.

పునాది రాళ్లు- ప్రాణం ఖరీదు చిత్రాలతో కథానాయకుడిగా చిరు కెరీర్ మొదలైంది. ఆరంభం చిరు గెటప్ డిఫరెంట్. కాలక్రమంలో సుప్రీం హీరోగా ఎదిగే క్రమంలో చిరు లుక్ ఎంతో ఇంప్రూవ్ అయ్యింది. ఆ కొత్త లుక్ ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఇక ఇంతింతై మెగాస్టార్ ఏకంగా 151 చిత్రాల్లో నటించేశారు. సైరాతో పాన్ ఇండియా స్టార్ గానూ పాపులరయ్యారు.

సైరా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో సత్తా చాటిన చిరు .. కొరటాల శివ దర్శకత్వంలో సోషియో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నారు. ఇటీవలే చిరు 152 లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దేవాలయ భూముల అవినీతి నేపథ్యంలో బర్నింగ్ పాలిటిక్స్ ని ఈ చిత్రంలో చూపించనున్నారని ప్రచారమవుతోంది.
Please Read Disclaimer