హీరో చిలిపి పని .. డబ్బులు వదిలించుకున్నాడు

0

ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందే కథ నాదంటూ కేసులు వేయడం మీడియా ముందుకొచ్చి న్యాయం కావాలంటూ అడగడం కామన్ అయిపొయింది. అయితే అందులో వాస్తవం లేక పోలేదు. చాలా మంది డైరెక్టర్స్ తన దగ్గరికి వచ్చిన కథలను కొన్ని మార్పులు చేసి తమ కథే అన్నట్టు చెప్పుకుంటారు. అయితే సరిగ్గా ఇలాంటి ఓ స్క్రిప్ట్ రైట్స్ కేసులో ఇరుక్కున్నాడు యంగ్ హీరో.

ఈ మధ్య తన సొంత కథంటూ ఓ సినిమా చేసాడు యంగ్ హీరో. తన కథ గురించి మీడియా ముందు చాలా విషయాలు చెప్పాడు. అందరూ హీరో గారు రైటర్ గా మారడని ఓ మంచి కథ తాయారు చేసుకున్నాడని రాసుకున్నారు. కట్ చేస్తే అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు. అవును ఆ హీరో రాసుకున్న కథ అతని సొంత కథ కాదంటూ సదరు రైటర్ గారు రైటర్స్ అసోసియేషన్ ఆశ్రయించాడు.

దీంతో ఈ కథ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విషయాన్ని రైటర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ కలిపి మెల్లగా సెటిల్ చేసారు. ముందు కథ నాదంటూ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొని హీరో ఫైనల్ గా తలవొంచి జేబులోంచి డబ్బులు తీసి సదరు రైటర్ కి అందించాడట. ఇంతకీ ఆ కథతో హీరో హిట్టు కొట్టింది లేదు కలెక్షన్స్ అందుకుంది లేదు కానీ రైటర్ కి డబ్బులు మాత్రం ఇవ్వాల్సి వచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-