#AA20 2020లో కష్టమేనా…?

0

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా బారినపడ్డ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 500 దాటిపోయాయి. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఇక కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోగా సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు కొత్త చిత్రాల విడుదల షూటింగ్స్ షురూ చేసే అవకాశం కూడా లేదు.

మన టాలీవుడ్ లో అనేక భారీ మరియు చిన్న చిత్రాల షూటింగ్ బ్రేక్ పడింది. వీటిలో అల్లు అర్జున్ మూవీ ఒకటి. సుకుమార్ – బన్నీ కాంబినేషన్ లో ఓ మాస్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ తెరకెక్కుతుండగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేశారు. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి కావడం తో అక్కడ షూటింగ్ చేసే ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పట్లో సాధారణ పరిస్థితి నెలకొని షూటింగ్ మొదలుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో బన్నీ-సుకుమార్ ల మూవీ 2020లో రావడం కష్టమే అంటున్నారు. అతని స్టైల్లో చెప్పాలంటే బన్నీకి మళ్ళీ గ్యాప్ రావడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. రష్మిక విజయసేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-